అబుదాబీ వేదికగా ముంబై ఇండియన్స్,కింగ్స్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలిత బ్యాటింగ్ చేసిన ముంబై , పంజాబ్ జట్టుకు 192 పరుగుల టార్గెట్‌ను నిర్థేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (70; 45 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స్‌లు) టాప్ స్కోర్‌రగా నిలిచాడు. చివరలో పొలార్డ్(47 నాటౌట్; 20 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా( 30 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)) మెరుపు ఇన్నింగ్స్‌తో .జట్టు స్కోర్‌ను పరిగెత్తించారు. కింగ్స్ పంజాబ్ బౌలర్లలో కాట్రెల్, షమీ, గౌతమ్‌లు ఒక్కో వికెట్ తీశారు.
POINTS TABLE:
అయితే ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 5000 పరుగుల మైలురాయిని అందుకున్న మూడో బాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకూ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా మాత్రమే 5 వేల పరుగుల క్లబ్లో ఉన్నారు. ఈ క్లబ్లో చేరడానికి రోహిత్ 173 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ రెండు జట్ల మధ్య 24 మ్యాచ్‌లు జరగ్గా ముంబై 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, కింగ్స్ పంజాబ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఐపీఎల్ 2020లో రెండు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడగా ఒకదాంట్లో మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించాయి. ఆర్సీబీ జట్టుపై పంజాబ్ విజయం సాధించగా, కోల్‌కతాపై ముంబై జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.
Published by:Rekulapally Saichand
First published:October 01, 2020, 21:30 IST