ఐపీఎల్ 2020

  • associate partner

KXIP vs KKR: రప్ఫాడించిన పంజాబ్.. ఈ మ్యాచ్ కూడా కింగ్స్‌‌దే!

షార్జా వేదికగా కింగ్స్ ఎలేవన్ పంజాబ్,కొల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగుతున్న మ్యా్చ్‌లో పంజాబ్ మరో విజయాన్ని తన ఖాతలో వేసుకుంది.

news18-telugu
Updated: October 26, 2020, 11:28 PM IST
KXIP vs KKR: రప్ఫాడించిన పంజాబ్.. ఈ మ్యాచ్ కూడా కింగ్స్‌‌దే!
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్(Image:IPL)
  • Share this:


షార్జా  వేదికగా కింగ్స్ ఎలేవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ మరో విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. 150 లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ టార్గెట్‌ను  సునాయసంగా  ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. కెఎల్‌.రాహుల్‌(28), మన్‌దీప్‌సింగ్‌(66)  గేల్‌(51) బ్యాట్‌తో రాణించారు. చక్రవర్తి వేసిన 8 ఓవర్లో  పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్‌ 28(25)పరుగులు చేసి ఔటయ్యాడు.  వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్‌ ఆఖరి బంతికి రాహుల్‌ ఎల్బీగా వెనుదిరిగాడు. కేఎల్  ఔటవ్వడంతో క్రీజ్‌‌లోకి యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌ గేల్(51)‌ దాటిగా ఆడాడు. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. గేల్‌, మన్‌దీప్‌ సింగ్‌ సూపర్ ఇన్నింగ్స్‌తో లక్ష్యం కరుగుతూ వచ్చింది. చివరకు 150 పరుగుల టార్గెట్‌ను 18.5 ఓవర్లలోనే ఛేదించిన కింగ్స్‌ పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

అంతకు ముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను బ్యాటింగ్ ఆహ్వనించింది. నిర్ణిత 20 ఓవర్లలో 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణాలు ఆరంబించిన. మెుదటిలోనే కోల్‌కతాకు భారీ షాక్ తగిలింది. మాక్స్‌వెల్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో బంతికి నితీశ్‌ రాణా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. షమి వేసిన 1.4వ బంతికి రాహుల్‌ త్రిపాఠి (7; 4 బంతుల్లో 1×6) ఔటయ్యాడు. కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్ ఆఖరి బంతికి దినేశ్‌ కార్తీక్‌(0) సైతం కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.





దీంతో కేకేఆర్‌ 10 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత గిల్‌.. ఇయాన్‌ మోర్గాన్‌ కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకునడిపించారు. వీరిద్దరూ కలిసి 81 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మోర్గాన్‌ (40; 25 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌) పరుగులు చేయగా గిల్‌ ( 57;45 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్స్‌) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో నరైన్‌(6),నాగర్‌కోటి(6), కమిన్స్‌(1)లు స్వల్ప స్కోర్‌కే ఔటయ్యారు.. చివర్లో ఫెర్గ్యూసన్‌(24 నాటౌట్‌; 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
Published by: Rekulapally Saichand
First published: October 26, 2020, 10:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading