KXIP vs DC: గబ్బర్ శ్రమ వృథా.. పంజాబ్ మరో అద్భుత విజయం

కింగ్స్ ఎల్‌వన్ పంజాబ్ మరో అద్భుత విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో తలపడుతున్న మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరవేసింది

news18-telugu
Updated: October 21, 2020, 7:09 AM IST
KXIP vs DC:  గబ్బర్ శ్రమ వృథా.. పంజాబ్ మరో అద్భుత విజయం
కింగ్స్ ఎల్‌వన్ పంజాబ్ మరో అద్భుత విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో తలపడుతున్న మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరవేసింది
  • Share this:
కింగ్స్ ఎల్‌వన్ పంజాబ్ మరో అద్భుత విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో తలపడిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరవేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేధించింది. ఈ హట్రిక్ విజయంతో ఫ్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మెుదటి బ్యాటింగ్ చేసిన ఢీల్లీ గబ్బర్ డాషింగ్ ఇన్నింగ్స్ కారణంగా 164 పరుగుల స్కోర్‌ను నమోదు చేసింది. ఇక చేధన అరంభించిన పంజాబ్ మెుదట్లో కీలక వికెట్లను చేజార్చుకుంది. ఈ టోర్నిలో మంచి టచ్‌లో కనిపిస్తున్న ఆ జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌ (15; 11 బంతుల్లో 1×4, 1×6) ప్వల్ఫ రన్స్‌కే ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన 2.2వ బంతికి భారీ షాట్‌ ఆడబోయి డేనియల్‌ సామ్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన యూనివర్స్‌ బాస్‌ క్రిస్‌గేల్‌.. ఢిల్లీ బౌలర్ తుషార్‌ దేశ్‌పాండేకు చుక్కలు చూపించాడు. వరుసగా 4, 4, 6, 4, 6తో ఆ బౌలర్‌ను బెదరగొట్టాడు. ఆ  ఓవర్లో తుషార్‌ 26 పరుగులు ఇచ్చాడు.





గేల్‌ విధ్వంసానికి అశ్విన్‌ చెక్‌పెట్టాడు. అతడిని క్లీన్‌బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. తర్వాత మయాంక్‌ అగార్వల్ (5) రనౌట్‌ అయ్యాడు. నికోలస్‌ పూరన్‌తో సమన్వయ లోపం కారణంగా ఫీల్డర్ చేతిలో బలయ్యాడు. మరో వికెట్ పడకుండా పూరన్,మాక్సీ ఇన్నింగ్స్‌ను పరుగుల పెట్టించారు. తుషార్‌ దేశ్‌పాండే మళ్ళీ టార్గెట్ అయ్యాడు అతను వేసిన 9 ఓవర్లలో పూరన్ వరుసగా 6, 4, 4 బాదేశాడు.దాటిగా ఆడుతున్న నికోలస్‌ పూరన్‌ (53; 28 బంతుల్లో 6×4, 3×6) రబాడ వేసిన 12.3వ బంతికి కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికే పంజాబ్ పటిష్ట స్థితిలో ఉంది. ఇక మిగితా పనిని ఇతర బాట్స్‌మెన్స్ పూర్తి చేశారు. ఢిల్లీ బౌలర్లలో రబడా రెండు వికెట్లు సాధించగా, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ గబ్బర్ (106 నాటౌట్‌; 61 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్స్‌లు) సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 164 పరుగుల మార్క్‌ను సాధించింది. పృథ్వీషా (7) పంత్‌ (14),శ్రేయస్‌ (14),స్టోయినిస్ ‌(9) స్వల్ఫ పరుగులకే ఔట్ కావడంతో పంజాబ్ ముందు ఢిల్లీ భారీ లక్యాన్ని ఉంచలేకపోయింది.
Published by: Rekulapally Saichand
First published: October 20, 2020, 11:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading