ఐపీఎల్ 2020

  • associate partner

KXIP vs DC: గర్జించిన గబ్బర్‌.. పంజాబ్ లక్ష్యం ఎంతంటే!

దుబాయ్ వేదికగా కింగ్స్ ఎల్‌వన్ సంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ 165 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న క్యాపిటల్స్ పంజాబ్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది

news18-telugu
Updated: October 20, 2020, 9:33 PM IST
KXIP vs DC:  గర్జించిన గబ్బర్‌.. పంజాబ్ లక్ష్యం ఎంతంటే!
దుబాయ్ వేదికగా కింగ్స్ ఎల్‌వన్ సంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ 165 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న క్యాపిటల్స్ పంజాబ్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది
  • Share this:
దుబాయ్ వేదికగా కింగ్స్ ఎల్‌వన్ సంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ 165 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న క్యాపిటల్స్ పంజాబ్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లోనూ గబ్బర్‌ గర్జించాడు. సెంచరీతో మరోసారి ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండో సెంచరీలు సాధించిన తొలి ఆటగాడుగా ధావన్‌ రికార్డు నెలకొల్పాడు .మెుదట బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీకి ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. జేమ్స్‌ నీషమ్‌ వేసిన నాలుగో ఓవర్‌ రెండో బంతికి పృథ్వీషా(7) ఔటయ్యాడు. దీంతో 25 పరుగుల వద్ద దిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది.తర్వాత కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడింపించారు ధావన్. ఈ టోర్నీలో మంచి ఫామ్‌ను కనబరుస్తున్న ఉన్న శ్రేయస్‌(14)ను మురుగన్‌ అశ్విన్‌ బొల్తా కొట్టించాడు. గాయం నుంచి కొలుకుని జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ మరొసారి నిరాశపరిచాడు. మాక్స్‌వెల్‌ వేసిన 14వ ఓవర్‌ నాలుగో బంతికి పంత్‌(14) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టోయినిస్‌(9) స్వల్ఫ పరుగులకే ఔటై పెవిలియన్ చేశాడు. వికెట్లు పడుతున్న మరోవైపు ధావన్‌ మాత్రం ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. గబ్బర్ (106 నాటౌట్‌; 61 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్స్‌లు) సెంచరీతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతనికి ఇతర బ్యాట్స్‌మెన్స్ ఎవరూ సహకరించకపోవడంతో ఓ మెస్తారు స్కోర్‌ను నమోదు చేసింది ఢిల్లీ. నిర్ణత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

ఇప్పటివరకు దిల్లీ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో టెబుల్ టాఫర్‌గా నిలిచింది. ఇక పంజాబ్‌ ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలే సాధించింది, ప్లేఆఫ్స్‌కు చేరలంటే అన్ని మ్యాచ్‌లను గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మ్యాచ్‌లో ముంబయిపై రెండో సూపర్‌ ఓవర్‌లో గెలిచి పంజాబ్‌లో ఆత్మవిశ్వాసంతో కనబడుతోంది. ఇక దిల్లీపైనా విజయం సాధించి మరో విజయాన్ని తన ఖాతలో వేసుకోవాలని చూస్తోంది.
Published by: Rekulapally Saichand
First published: October 20, 2020, 9:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading