IPL 2020 LIVE Score, RR vs KKR: రాజస్తాన్‌కు తొలి ఓటమి.. అదరగొట్టిన కేకేఆర్ బౌలర్లు

దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్,కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఐపీఎల్ 2020లో తొలిసారి ఓటమిని చవిచూసింది.

news18-telugu
Updated: September 30, 2020, 11:54 PM IST
IPL 2020 LIVE Score, RR vs KKR: రాజస్తాన్‌కు తొలి ఓటమి.. అదరగొట్టిన కేకేఆర్ బౌలర్లు
kkr vs rr
  • Share this:
దుబాయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్,కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఐపీఎల్ 2020లో తొలి ఓటమిని చవిచూసింది. 37పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కోల్‌కతా  బౌలర్ల దాటికి కేవలం 137 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్‌ నిర్ధేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌‌కు ఆదిలోనే కష్టాలే ఎదురయ్యాయి. 15 పరుగులకే ఓపెనర్‌ స్మిత్‌(3) వికెట్‌ను కోల్పోయింది.



ఆ తర్వాత వచ్చిన సంజూ శామ్సన్‌ కేవలం 8 పరుగులే చేసి క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. మంచి టచ్‌లో కనిపించిన ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(21) కూడా ఔటవ్వడంతో ఆర్ఆర్ కొలులేకపోయింది. ఆ తర్వాత రాబిన్‌ ఊతప్ప , రియాన్‌ పరాగ్‌లు కూడా స్వల్ఫ పరుగులకే పెవిలియన్ చేరడంతో 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. దీంతో రాజస్థాన్ క్రమంగా ఓటమి వైపు నడిచింది. శివం మావి, నాగర్‌కోటి, వరుణ్‌లు తలో రెండు వికెట్లు తీయగా, కమిన్స్‌, సునీల్‌ నరైన్‌ కుల్దీప్‌ యాదవ్‌లు ఒక్కో వికెట్‌ తీశారు.



POINTS TABLE: అంతకుముందు మెుదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ గిల్‌ మరోసారి తన మార్కు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్‌ నరైన్‌ మరోసారి పూర్తిగా విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్‌ రాణా,గిల్‌కు చక్కటి సహకారం అందించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి  కేకేఆర్ వికెట్‌ నష్టానికి 42 పరుగులు చేసింది. 10 ఓవర్‌లో భారీ షాట్‌ ప్రయత్నించి నితీష్‌ రాణా క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రసెల్‌ కాసేపు మెరుపులు మెరిపించాడు. 14 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్ మరోసారి విఫలమయ్యాడు. ఇక చివర్లో ఇయాన్‌ మోర్గాన్‌ దాటీగా ఆడి 23బంతుల్లో 34 పరుగులు చేసి కోల్‌కతా 170 పరుగులు దాటేలా చేశాడు. ఇక రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌ 2 వికెట్లు తీయగా, అంకిత్‌ రాజ్‌పుత్‌, టామ్‌ కరన్‌, ఉనాద్కట్‌, తెవాటియాలు ఒక్కో వికెట్‌ తీశారు
Published by: Rekulapally Saichand
First published: September 30, 2020, 11:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading