IPL 2020 LIVE Score, RR vs KKR: రాజస్తాన్‌ టార్గెట్ 175 పరుగులు.. గిల్ సూపర్ బ్యాటింగ్

దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మెుదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా..


Updated: September 30, 2020, 11:47 PM IST
IPL 2020 LIVE Score, RR vs KKR: రాజస్తాన్‌ టార్గెట్ 175 పరుగులు.. గిల్ సూపర్ బ్యాటింగ్
kkr vs rr
  • Share this:
ipl 2020లో భాగంగా దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్లు తలపడుతున్నాయి.  ఈ మ్యాచ్‌లో మెుదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. రాజస్థాన్‌కు 175 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో కేకేఆర్   ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లోనూ కోల్‌కత్తా ఓపెనర్ నరైన్‌ (15) స్వల్ఫ పరుగులకే ఔటై మళ్ళీ నిరాశ పరిచాడు. దాటిగా ఆడతాడు అనుకున్న నితీశ్‌ రాణా(22) కూడా పెవిలియన్ చేరడం,ఆ తర్వాత వచ్చిన అండ్రూ రసెల్ (24),కార్తీక్‌ (1) ఔటవ్వడంతో స్కోర్ క్రమంగా మందగిస్తూ వచ్చింది.  ఆండ్రీ రసెల్‌ 3 సిక్సర్లు కొట్టి 14 బంతుల్లో 22 పరుగులు చేసినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఓపెనర్ గిల్ (47; 34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో మోర్గాన్ (34 ; 22 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) హిట్టింగ్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌ 2 వికెట్లు తీయగా, అంకిత్‌ రాజ్‌పుత్‌, టామ్‌ కరన్‌, ఉనాద్కట్‌, తెవాటియాలు తలో వికెట్‌ తీశారు.

POINTS TABLE:

అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకుని కోల్‌కత్తాను బ్యాటింగ్‌ను ఆహ్వనించాడు. రాజస్ధాన్, కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు జరగలేదు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు జరగ్గా.. చెరో పది విజయాలు నమోదు చేశారు. గత రెండు సీజన్ల నుంచి రాజస్ధాన్‌పై కోల్‌కతాదే పైచేయి. అయితే ఈ మ్యాచ్ ఎవరూ గెలుస్తారని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Published by: Rekulapally Saichand
First published: September 30, 2020, 9:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading