ఐపీఎల్ 2020లో భాగంగా షార్జావేదికగా వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ.. రాజస్దాన్‌కు 185 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మెుదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ అరంభంలో కాస్త తడబడింది. ఓపెనర్స్ పృథ్వీ షా(19), శిఖర్ ధావన్(5) మంచి అరంభాన్ని ఇవ్వలేకపోయారు. జోఫ్రా ఆర్చర్ వేసిన రెండో ఓవర్లో ధావన్(5) తొలి వికెట్‌గా వెనుదిరిగారు. కొద్ది సేపటికే పృథ్వీషా(19) కూడా ఔటయ్యాడు.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(22), రిషభ్ పంత్(5) రనౌట్‌గా వెనుదిరిగారు. ఢిల్లీ 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో కష్టాల్లో పడిన ఢిల్లీని హెట్మెయిర్(45; 24 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్స్‌లు), మార్కోస్ స్టోయినిస్(39; 30బంతుల్లో 4 సిక్స్‌లు) అదుకున్నారు. చివరిలో టైలేండర్స్ హర్షల్ పటేల్(16 నాటౌట్), అక్షర్ పటేల్(17) కాస్త బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, కార్తీక్ త్యాగి, ఆండ్రూ టై, రాహుల్ తెవాటియా ఒక్కొ వికెట్ సాధించారు.
అంతకు ముందు టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీని బ్యాటింగ్ ఆహ్వనించింది.ఇక రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో మార్పులు చేసింది. వరుణ్ ఆరుణ్, ఆండ్రూ టై తుది జట్టులోకి రాగా.. అంకిత్ రాజ్ పుత్, టామ్ కరన్ బెంచ్‌కు పరిమితమయ్యారు.. ఢిల్లీ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగింది. వరుస ఓటములతో ఓత్తిడిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఐదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రెండింటిలోనే గెలిచింది. టోర్నీలో ఆదరగొడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మంచి ఊపుమీదు కనిపిస్తోంది.
Published by:Rekulapally Saichand
First published:October 09, 2020, 21:19 IST