HOME »NEWS » »ipl 2020 live score dc vs rr live cricket score and match 23 updates online sharjah delhi capitals rajasthan royals latest news today sa 2

IPL 2020 Live Score, DC vs RR: మారని రాజస్థాన్ రాయల్స్ రాత.. ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్ షో

IPL 2020 Live Score, DC vs RR:  మారని రాజస్థాన్ రాయల్స్ రాత.. ఢిల్లీ క్యాపిటల్స్‌ సూపర్ షో
Delhi Capitals vs

షార్జా వేదికగా రాజస్తాన్‌ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బాట్స్‌మెన్స్ పూర్తిగా చేతులెత్తేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ ప్రతిభతో రాజస్ధాన్ జట్టుపై 46 పరుగులతో తేడాతో ఘన విజయం సాధించింది.

  • Share this:
    షార్జా వేదికగా రాజస్తాన్‌ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బాట్స్‌మెన్స్ పూర్తిగా చేతులెత్తేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ ప్రతిభతో రాజస్ధాన్ జట్టుపై 46 పరుగులతో తేడాతో ఘన విజయం సాధించింది. 185 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఏ దిశలోనూ లక్ష్య చేధన వైపు సాగలేదు. ఢిల్లీ బౌలర్ల దాటికి రాజస్థాన్ రాయల్‌ బ్యాటింగ్ ఆర్డర్ చతికిలబడింది. 138 పరుగులకు కుప్పకూలింది.

    యశ్వంత్ జైస్వాల్ (34, 36 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్) రాహుల్ తెవాటియా(38 , 29బంతుల్లో 2 సిక్స్‌లు,3 ఫోర్లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. గత మ్యాచ్‌లో హిట్టింగ్ ఆడిన జాస్ బట్లర్(13) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇక కెప్టెన్ స్మిత్(24),సంజూ శాంసన్(5) కూడా స్వల్ఫ స్కోర్‌కే ఔటయ్యారు. టాపార్డర్ చేతులెత్తేయడంతో రాజస్థాన్ టార్గెట్‌ను చేధించలేక బారీ తేడాతో ఓటమి చవిచూసింది.







    అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఆరంభంలో ఢిల్లీ తడబడింది. ఓపెనర్స్ పృథ్వీ షా(19), శిఖర్ ధావన్(5) మంచి అరంభాన్ని ఇవ్వలేకపోయారు. శ్రేయస్‌ అయ్యర్‌(22; 18 బంతుల్లో 4 ఫోర్లు) కూడా స్వల్ఫ పరుగులకే ఔటయ్యాడు.  దీంతో ఢిల్లీ 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దాటిగా ఆడతాడు అనుకున్న రిషభ్‌ పంత్‌(5) రనౌట్‌గా ఔటయ్యాడు.
    POINTS TABLE:

    SCHEDULE TIME TABLE:

    ORANGE CAP:

    PURPLE CAP:

    దీంతో కష్టాల్లో పడిన ఢిల్లీని మార్కస్ స్టోయినిస్(30 బంతుల్లో 4 సిక్స్‌లతో 39), షిమ్రాన్ హెట్‌మైర్(24 బంతుల్లో 5 సిక్స్‌లు 1 ఫోర్‌తో 45) అదుకున్నారు. రాజస్థాన్ ముందు కట్టుదిట్టమైన ఫీల్డింగ్, బౌలింగ్‌తో ఆకట్టుకున్న చివరిలో విఫలమైంది. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది.
    Published by:Rekulapally Saichand
    First published:October 09, 2020, 23:26 IST

    टॉप स्टोरीज