news18-telugu
Updated: November 2, 2020, 7:30 PM IST
DC vs RCB Today's Match at Abu Dhabi:
అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ రసవత్తర పోరు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెబుల్లో రెండో స్థానం కోసం ఢిల్లీ,ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు మూడు మార్పులు చేసింది. అజింక్య రహానె, అక్షర్ పటేల్, డేనియల్ శామ్స్ తుది జట్టులోకి వచ్చారు. ఇక విరాట్ కోహ్లీ కూడా జట్టులో కొన్ని మార్పలు చేశారు. గుర్కీరత్ మన్, సైనికి తుది జట్టులో స్థానంలో లభించలేదు. వీరి స్థానాల్లో శివమ్ దూబే, షబాజ్ అహ్మద్ టీమ్‌లోకి వచ్చారు.
ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఓడిన జట్టుకు ప్లే ఆఫ్స్ కష్టమవుతుంది. మిగితా జట్ల గెలుపోటములపై అధాపడాల్సి ఉంటుంది. మెుదటి మ్యాచ్‌లో ఆర్సీబీని ఢిల్లీ 59 పరుగులతో చిత్తు చేసింది.
తుది జట్లురాయల్ చాలెంజర్స్ బెంగళూరు: జోష్ ఫిలిప్, దేవదత్ పాడికల్, విరాట్ కోహ్లీ (C), ఎబి డివిలియర్స్ (WC), వాషింగ్టన్ సుందర్, శివం దుబే, షాబాజ్ అహ్మద్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదనా, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (C), రిషబ్ పంత్ (WC), మార్కస్ స్టోయినిస్, డేనియల్ సామ్స్, ఆక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అన్రిచ్ నార్ట్జే
Published by:
Rekulapally Saichand
First published:
November 2, 2020, 7:08 PM IST