news18-telugu
Updated: November 3, 2020, 8:37 AM IST
delhi capita;s
అబుదాబి వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. బెంగళూర్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని క్యాపిటల్స్ సులభంగా చేధించింది.
ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడం,రహానే కూడా దాటిగా ఆడడంతో ఆర్సీబీపై విక్టరీ నమోదు చేసుకుంది. ఓపెనర్ పృథ్వీషా 9 పరుగులకే ఔటైనా ధావన్,రహానే రన్‌రేట్ పడిపోకుండా బ్యాటింగ్ కొనసాగించారు. బలపడుతున్న వీరిద్దరి భాగస్వామ్యాన్ని షహబాజ్ అహ్మద్ వీడదిశాడు. శిఖర్ ధావన్ ( 54; 41 బంతుల్లో 6 ఫోర్లు) షాబాజ్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి దూబె చేతికి చిక్కాడు. తర్వాత రహానే,కెప్టెన్ శ్రేయస్ ఇన్నింగ్స్ ముందుండి నడిపించారు. రహానే ( 60; 46 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్) ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ఇక దాటిగా ఆడే క్రమంలో శ్రేయస్,రహానే ఔటయ్యారు. అప్పటికే ఢిల్లీ పటిష్ట స్ధితిలో ఉండడంతో మిగితా పనిని పంత్,స్టాయినిస్ పూర్తి చేశారు. దీంతో ఢిల్లీ 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరింది. ఆర్సీబీ ఓడినప్పటికీ ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తే మూడో స్థానానికి చేరే అవకాశం ఉంది. దీంతో ఆర్సీబీ నాల్గో స్థానంలోకి చేరుతుంది. ఒకవేళ సన్‌రైజర్స్ ఓడితేనే కేకేఆర్‌కు ప్లేఆఫ్స్ అవకాశం ఉంటుంది.
అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాటింగ్‌కు అహ్వనించింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టుగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ.. ప్రత్యర్థికి 153 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఓపెనర్ దేవదూత్ పడిక్కల్(50; 41 బంతుల్లో 5 ఫోర్లు) పాటు విరాట్ కోహ్లి(29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్(35; 21 బంతుల్లో 1 ఫోర్, 2సిక్స్‌లు) రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే మూడు వికెట్లు సాధించగా, రబడా రెండు వికెట్లు తీశాడు. అశ్విన్‌కు ఒక్క వికెట్ దక్కింది.
Published by:
Rekulapally Saichand
First published:
November 2, 2020, 10:56 PM IST