ఐపీఎల్ 2020

  • associate partner

DC vs RCB: పడిక్కల్ దూకుడు.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే!

ఐపీఎల్‌ 2020లో భాగంగా అబుదాబీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు  153 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

news18-telugu
Updated: November 2, 2020, 9:12 PM IST
DC vs RCB: పడిక్కల్ దూకుడు.. ఢిల్లీ లక్ష్యం ఎంతంటే!
IPL 2020 Live Score, DC vs RCB
  • Share this:
ఐపీఎల్‌ 2020లో భాగంగా అబుదాబీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు  153 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
మెుదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ పడిక్కల్‌ (50; 41 బంతుల్లో 5 ఫోర్లు) విరాట్ కోహ్లీ (29; 24 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌), డివిలియర్స్‌(35; 21 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లు) రాణించడంతో బెంగళూర్ గౌరవప‍్రదమైన స్కోరు సాధించింది. ఢిల్లీ ముందు 153 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ముందుగా టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్‌ ఎంచుకుని ఆర్సీబీని బ్యాటింగ్‌కు అహ్వానించింది. దీంతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ఆరంభించిన పడిక్కల్‌,ఫిలిప్‌ మంచి శభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నాల్గో ఓవర్‌లో రబాడ వేసిన తొలి బంతికి షాట్‌ ఆడబోయి ఫిలిప్ (12) పృథ్వీ షా చేతికి చిక్కాడు. పవర్‌ప్లేలో వికెట్‌ కోల్పోయినా 40/1తో మెరుగైన స్థితిలోనే నిలిచింది.

కోహ్లీ, పడిక్కల్‌ ఇన్సింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నమోదుచేశారు. 12 ఓవర్లో అశ్విన్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించిన కోహ్లీ.. బౌండరీ లైన్‌ దగ్గర స్టాయినిస్‌‌కు క్యాచ్ ఇచ్చాడు. మరొవైపు పడిక్కల్ (50) ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని అర్ధశతకం సాధించాడు. 16 ఓవర్లో ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. నోర్జె వేసిన ఆ ఓవర్లో నాలుగో బంతికి పడిక్కల్‌ క్లీన్‌బౌల్డవ్వగా,చివరి బంతికి మోరిస్ (0) షాట్‌కు యత్నించి వికెట్‌ కీపర్ పంత్‌ చేతికి చిక్కాడు. చివరిలో డివిలియర్స్‌(35; 21 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లు) శివమ్‌ దూబె (17) బ్యాట్ ఝళీపించడంతో ఆర్సీబీ నిర్ణత 20 ఓవర్లో 152 పరగులు చేసింది.

ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. గెలిచిన జట్టు నేరుగా ఫ్లేఆఫ్ చేరుకుంటే.. ఓడిన జట్టు భవిష్యత్ మాత్రం ఇతర జట్లపై అధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆర్‌సీబీ, ఢిల్లీ జట్లు 14 పాయింట్లతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరితే.. ఓడినా జట్టు మాత్రం హైదరాబాద్- ముంబై మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఓడినా జట్టుకు మరో అవకాశం ఉంటుంది. కోల్‌కతా రన్‌రేట్ కంటే ఓడినా జట్టు రన్ రేటు తక్కువ ఉంటే మాత్రం ఇక టోర్నీ నుంచి నిష్క్రరమణ తప్పదు.
Published by: Rekulapally Saichand
First published: November 2, 2020, 9:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading