Home /News /ipl /

IPL 2020 LIVE SCORE CSK VS SRH LIVE CRICKET SCORE AND MATCH 14 UPDATES ONLINE DUBAI CHENNAI SUPER KINGS VS SUNRISERS HYDERABAD LATEST NEWS TODAY SA 2

IPL 2020 LIVE Score, CSK vs SRH: కుర్రాళ్ళు దంచేశారు.. సీఎస్‌కే టార్గెట్ 165

CSK VS SRH

CSK VS SRH

దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో మెుదటి బ్యాటింగ్ చేసిన నన్ రైజర్స్  164 పరుగుల స్కోర్‌ను నమోదు చేసింది.

    దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగుతున్న మ్యాచ్‌లో మెుదటి బ్యాటింగ్ చేసిన నన్ రైజర్స్  164 పరుగుల స్కోర్‌ను నమోదు చేసింది. ఆరంభంలోనే హైదరాబాద్ షాక్ తగిలింది.  ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న జానీ బెయిర్‌స్టో డకౌట్ కావడంతో.. సన్‌రైజర్స్  కాస్త తడబడింది. మరో ఓపెనర్ వార్నర్(26) కూడా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఇక మిడ్‌లార్డర్ బాట్స్‌మెన్ మనీష్ పాండ్(29) ,కేన్ విలియమ్సన్(9) కూడా స్వల్ఫ స్కోర్‌కే ఔటై పెవిలియన్ చేరారు. 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చివరిలో అభిషేక్ శర్మ(31), ప్రియామ్ గార్గ్(51)  సూపర్ బ్యటింగ్‌తో  సన్‌రైజర్స్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. చెన్నై లాంటి బలంమైన జట్టుకు టార్గెట్ నిర్ధేశించడంలో సన్ రైజర్స్ విజయవంతమైంది.

    POINTS TABLE:
    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు చివరి స్థానంలో ఉన్నాయి. దీంతో ఈ జట్ల మధ్య జరిగే ఫైట్ ఎలా ఉంటుందనేదానిపై ఫ్యాన్స్‌లో ఉత్కంఠత నెలకొంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 12 సార్లు తలపడ్డాయి. వీటిలో చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది సార్లు విజయాన్ని సాధించిచగా. మూడుసార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: Chennai Super Kings, IPL 2020, Sunrisers Hyderabad, UAE

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు