ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: మెరిసిన నితీష్ రానా.. చెన్నై లక్ష్యం ఎంతంటే!

ఐపీఎల్‌ 2020లో దుబాయ్ వేదికగా మరో రసవత్తర పోరు సాగుతుంది. కోల్‌కతా ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్‌ బేర్తు ఖాయం చేసుకోవాలని చూస్తోంది.

news18-telugu
Updated: October 29, 2020, 9:08 PM IST
IPL 2020:  మెరిసిన నితీష్ రానా.. చెన్నై లక్ష్యం ఎంతంటే!
Kolkata Eye Final Flourish
  • Share this:
ఐపీఎల్‌ 2020లో దుబాయ్ వేదికగా మరో రసవత్తర పోరు సాగుతుంది. కోల్‌కతా ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్‌ బేర్తు ఖాయం చేసుకోవాలని చూస్తోంది. మెుదటిగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్,చెన్నైకి 173 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. మెుదటిగా టాస్ గెలిచిన చెన్నై.. కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కేకేఆర్ ఓపెనర్లు శుభమన్‌ గిల్, నితీష్ రానాలు ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ బ్యాట్‌ ఝులిపించారు. జట్టు స్కోరు 50 పరుగులకు చేరగానే కేకేఆర్ తొలి వికెట్ కోల్పొయింది. కరణ్‌ శర్మకు బౌలింగ్‌లో దాటిగా ఆడుతున్న శుభమన్ గిల్‌ 26(17) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

తర్వాత వచ్చిన నరైన్‌ 7(7) మరోసారి నిరాశపరిచాడు. శాంట్నర్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ మూడో బంతికి భారీషాట్‌కు ప్రయత్నించిన నరైన్‌ బౌండరీల లైన్‌ వద్ద జడేజా చేతికి చిక్కాడు. కరణ్‌ శర్మ వేసిన 16వ ఓవర్‌లో రాణా మూడు సిక్సర్లు బాది మంచి టచ్‌లో కనిపించాడు. అయితే వరుస బౌండరీలతో ఊపు మీద కనిపిస్తున్న రాణాను ఎంగిడి ఔట్‌ చేశాడు. రాణా 87(61, 10ఫోర్లు, 4సిక్సర్లు) భారీ షాట్‌కు ప్రయత్నించి సామ్‌ కరన్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత కెప్టెన్‌ మోర్గాన్(15),దినేష్ కార్తిక్(21) ఇన్పింగ్స్‌ను ముందుండి నడిపించారు. చివరకు కేకేఆర్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది.

POINTS TABLE:

SCHEDULE TIME TABLE:

అంతకుముందు టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్‌ బెర్తు అవకాశాలను మరింత మెరుగుపరచుకోవాలని కోల్‌కతా భావిస్తోంది. చెన్నై ప్లేఆఫ్‌ రేసులో లేకపోయిన్పటికి.. ఆ జట్టు ఆడే మ్యాచ్‌లు ఇతర టీంల భవిష్యత్‌ను నిర్థేశిస్తుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే భారీ మార్పులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, మోను కుమార్ స్థానంలో షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, కర్ణ్‌ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక కోల్‌కతా ప్రసిద్ కృష్ణ స్థానంలో రింకు సింగ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. కేకేఆర్‌కు ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఈ గేమ్‌లో గెలిస్తేనే కేకేఆర్‌కు ప్లేఆఫ్‌ అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన కేకేఆర్‌ 6 విజయాలతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు చెన్నై 12 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాంధించి 8 ఓటములతో చివరిస్థానంలో ఉంది.
Published by: Rekulapally Saichand
First published: October 29, 2020, 9:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading