IPL 2020: ఐపీఎల్‌కు అడుగడుగునా అడ్డంకులు.. బీసీసీఐ ఉక్కిరిబిక్కిరి!

కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడుతూ వచ్చిన ఐపీఎల్ త్వరలో ప్రారంభంకానుంది. సెప్టెంబర్19 నుంచి నవంబర్10 వరకు జరిగే ఈ లీగ్ కోసం బీసీసీఐ ప్రయత్నాలు మెుదలుపెట్టింది.

Rekulapally Saichand
Updated: August 6, 2020, 4:42 PM IST
IPL 2020: ఐపీఎల్‌కు అడుగడుగునా అడ్డంకులు.. బీసీసీఐ ఉక్కిరిబిక్కిరి!
ఐపీఎల్ ట్రోఫి
  • Share this:
కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడుతూ వచ్చిన ఐపీఎల్ త్వరలో ప్రారంభంకానుంది. సెప్టెంబర్19 నుంచి నవంబర్10 వరకు జరిగే ఈ లీగ్ కోసం బీసీసీఐ ప్రయత్నాలు మెుదలుపెట్టింది. మరోవైపు ఈ మెగా టోర్నీకి కష్టాల మాత్రం వీడడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. మెుదటిలో కరోనా ఆ తర్వాత లీగ్‌కు అడ్డుగా నిలిచిన అసియా కప్,టీ20 వరల్డ్ కప్. వాటితో వాయిదాతో లీగ్‌కు మార్గం సుగుగమైంది.

తర్వాత వేదిక విషయంలో కొంత అయోమయం నెలకొంది. పలు వేదికలను పరిశీలించిన బీసీసీఐ చివరకు యుఏఈలో టోర్నీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అంతలోనే వివో టైటిల్ స్పాన్సర్ నుంచి తప్పుకుంది. దేశంలో చైనా వస్తువల బహిష్కరణ డిమాండ్ గట్టిగా వినిపించడంతో చివరకు వివో టైటిల్ స్పాన్సర్ నుంచి తప్పుకుంది. దీంతో బోర్డుకు రూ.440 కోట్ల ఆదాయాన్ని కొల్పోవాల్సి వచ్చింది.

ఇక ప్రాంచైజీలతో కూడా బీసీసీఐ ఇబ్బందులు ఎదురుకుంది. వాటి గొంతెమ్మ కోరికలు, డిమాండ్లు బోర్డును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్(ఎస్‌ఓపీ) విషయంలో ఫ్రాంచైజీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాగే గేట్ మనీ‌ని రీయంబర్స్ చేయాలంటూ కోరాయి. ఇక టైటిల్ స్పాన్సర్ వివో తప్పుకుంటే వచ్చే నష్టాన్ని బోర్డే భరించాలని ఫ్రాంచైజీలు తెల్చిచెప్పాయి.
Published by: Rekulapally Saichand
First published: August 6, 2020, 4:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading