ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: మాక్స్‌వెల్ విఫలమవుతున్నా ఆడించడానికి కారణం అదే!: కేల్ రాహుల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌లో వరుస ఓటములతో కాస్త కుదేలైనా పంజాబ్.. అనూహ్యంగా పుంజుకుంది. హట్రిక్ విజయాలతో ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. క్రిస్ గేల్ జట్టులోకి వచ్చిన వేళా విశేషమో కానీ వరుస విజయాలతో దూసుకువెళ్తుంది.

news18-telugu
Updated: October 22, 2020, 11:01 AM IST
IPL 2020: మాక్స్‌వెల్ విఫలమవుతున్నా ఆడించడానికి కారణం అదే!: కేల్ రాహుల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌లో వరుస ఓటములతో కాస్త కుదేలైనా పంజాబ్.. అనూహ్యంగా పుంజుకుంది. హట్రిక్ విజయాలతో ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. క్రిస్ గేల్ జట్టులోకి వచ్చిన వేళా విశేషమో కానీ వరుస విజయాలతో దూసుకువెళ్తుంది.
  • Share this:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020‌లో వరుస ఓటములతో కాస్త కుదేలైనా పంజాబ్.. అనూహ్యంగా పుంజుకుంది. హట్రిక్ విజయాలతో ప్లేఆఫ్ రేసులోకి వచ్చింది. క్రిస్ గేల్ జట్టులోకి వచ్చిన వేళా విశేషమో కానీ వరుస విజయాలతో దూసుకువెళ్తుంది. అంతకుముందు విజయం ముంగిట వరకు వెళ్ళి బొల్తా పడేది. రాహుల్,మయాంక్ రాణించి ఇతర ఆటగాళ్ళు రాణించకపోవడంతో జట్టు వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. కానీ పంజాబ్ మాత్రం అతన్ని తుది జట్టులోకి తీసుకుంటుంది.

ఏమాత్రం ప్రభావం చూపని అతన్ని ఎందుకు ఆడిస్తున్నారని పలువురు మాజీ క్రికెటర్లు.. పంజాబ్ యాజామాన్యాన్ని ప్రశ్నించించారు. అవెమి పట్టించుకోకుండా సారథి కేఎల్ రాహుల్, పంజాబ్ యాజామాన్యం మాక్స్‌వెల్‌ను తుది జట్టులోకి తీసుకుంటుంది. అయితే మాక్స్‌వెల్‌ను ఆడించడంపై పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ క్లారీటీ ఇచ్చాడు. " ప్రాక్టీస్‌ సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ ఆటతీరు అద్భుతంగా ఉంటుంది. బ్యాటింగ్‌లో సాధన చేస్తూ ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడు. జట్టులో అతని మేటి ప్లేయర్. అతను తుది జట్టులో ఉంటే టీం బాలెన్స్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. అందరూ ఆడాలని రూల్ ఏంలేదు. ఏదో విభాగంలో విఫలమవుతూనే ఉంటారు. జట్టుకు మ్యాచ్ విన్నర్‌లు చాలా అవసరం. అలాంటి లక్షణం మాక్స్‌వెల్‌లో కనిపిస్తోంది" అంటూ చేప్పుకోచ్చాడు.

"మ్యాక్స్‌వెల్ ఈ సీజన్‌లో వైఫల్యం చెందుతున్నాడు. ఢిల్లీ ఆడిన మ్యాచ్‌లో మ్యాక్సీ చేసిన 32 పరుగులు జట్టు విజయంలో కీలకమైనవి.. ఈ మ్యాచ్‌తో అతను ఫామ్‌లోకి వచ్చాడు అనుకుంటున్నా.. అతను నుంచి మరో మంచి ఇన్నింగ్స్ చూడవచ్చు. ఎలాంటి సమయంలోనైనా అతను రాణించగలడు. అందుకే అతన్ని తుది జట్టులో ఆడిస్తున్నామన్నారు" రాహుల్

దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో తలపడిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగరవేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేధించింది. ఈ హట్రిక్ విజయంతో ఫ్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
Published by: Rekulapally Saichand
First published: October 22, 2020, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading