ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 LIVE Score, KKR vs SRH: శుభ్‌మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్, బోణీకొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్

Dream11 IPL 2020 Live Score: ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. శుభం గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

news18-telugu
Updated: September 26, 2020, 11:27 PM IST
IPL 2020 LIVE Score, KKR vs SRH: శుభ్‌మన్ గిల్ సూపర్ ఇన్నింగ్స్, బోణీకొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్
శుభం గిల్ (Image;IPL/Twitter)
  • Share this:
IPL 2020లో భాగంగా అబుదాబిలో జరుగుతున్న 8వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బోణీ కొట్టింది. ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మీద ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. కేవలం 18 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది కోల్‌కతా నైట్ రైడర్స్. రెండో మ్యాచ్‌లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిని మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ ఆడుతూ పాడుతూ ఛేజ్ చేశారు. ఎక్కడా తడబడలేదు. ముఖ్యంగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ (నరైన్, దినేష్ కార్తీక్) డకౌట్ అయిన తర్వాత కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ కూల్‌గానే ఆడారు.  శుభ్‌మన్ గిల్ , ఇయాన్ మోర్గాన్ ఇద్దరూ కలసి కోల్‌కతా జట్టును విజయతీరాలకు చేర్చారు. వారిద్దరి పార్ట్‌నర్‌షిప్ చాలా బాగుంది. యువకుడైనా కూడా శుభ్‌మన్ గిల్ ఆడిన విధానం టీమ్ ప్లేయర్లను ఆకట్టుకుంది.

ఐపీఎల్ 2020లో బోణీకొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్


వాస్తవానికి 143 పరుగులు ఛేజింగ్ చేయడానికి బరిలో దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో ఓవర్‌కే ఫస్ట్ వికెట్‌ను కోల్పోయింది. సన్ రైజర్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రెండో ఓవర్లో రెండో బంతికి ఓపెనర్ నరైన్ వికెట్ తీసుకున్నాడు. నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను కెప్టెన్ వార్నర్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత 13 బంతుల్లో 26 పరుగులు చేసి డేంజర్‌గా మారుతున్న మరో ఓపెనర్ నితేష్ రాణాను నటరాజన్ పెవిలియన్‌కు పంపాడు. నటరాజన్ వేసిన 4వ ఓవర్లో రాణా ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్నాడు కీపర్ వృద్ధిమాన్ సాహా. దీంతో కోల్‌కతా రెండో వికెట్‌ను కోల్పోయింది. 6 ఓవర్ల వద్ద పవర్ ప్లే ముగిసే సమయానికి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 2 వికెట్లు కోల్పోయి 52 రన్స్ చేసింది.


పవర్ ప్లే తర్వాత రషీద్ ఖాన్ బౌలింగ్‌కు వచ్చాడు. తన రెండో బంతికే దినేష్ కార్తీక్‌ను ఎల్బీడబ్ల్యూ ద్వారా పెవిలియన్‌కు పంపాడు. దినేష్ కార్తీక్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. శుభ్‌మన్ గిల్, మోర్గాన్ కలసి మెల్లగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వికెట్ పడకుండా కాపాడుకున్నారు. శుభ్‌మన్ గిల్ 42 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.



గేమ్ ఛేంజర్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ : శుభ్‌మన్ గిల్
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ : నితేష్ రాణా
మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు: మనీష్ పాండే
పవర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: పాట్ కమిన్స్

కోల్‌కతా బ్యాటింగ్

నరైన్ (డకౌట్)
నితేష్ రాణా (13 బంతుల్లో 26 పరుగులు. 6 ఫోర్లు)
దినేష్ కార్తీక్ (డకౌట్)
శుభ్‌మన్ గిల్ (  62 బంతుల్లో 70 పరుగులు. 5 ఫోర్లు, 2 సిక్స్‌లు, నాటౌట్  )
ఇయాన్ మోర్గాన్ ( 29 బంతుల్లో 42 పరుగులు. 3 ఫోర్లు, 2 సిక్స్‌లు, నాటౌట్)


సన్ రైజర్స్ బౌలింగ్
)

మహ్మద్ నబీ (4 ఓవర్లు, 23 పరుగులు)
రషీద్ ఖాన్ (4 ఓవర్లు, 25 పరుగులు, 1 వికెట్)
భువనేశ్వర్ కుమార్ (3 ఓవర్లు, 29 పరుగులు)
ఖలీల్ అహ్మద్ (3 ఓవర్లు, 28 పరుగులు, 1 వికెట్)
నటరాజన్ (3 ఓవర్లు, 27 పరుగులు, 1 వికెట్)
అభిషేక్ శర్మ (1 ఓవర్, 11 పరుగులు)

సన్ రైజర్స్ బ్యాటింగ్

డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 36 పరుగులు. 2 ఫోర్లు ఒక సిక్స్)
బెయిర్ స్టో (10 బాల్స్‌లో 5 రన్స్.)
మనీష్ పాండే (38 బంతుల్లో 51 పరుగులు. 3 ఫోర్లు, 2 సిక్సులు)
వృద్ధిమాన్ సాహా (31 బంతుల్లో 30 పరుగులు, ఒక ఫోర్, ఒక సిక్స్)
మహమ్మద్ నబీ (8 బంతుల్లో 11 పరుగులు. 2 ఫోర్లు, నాటౌట్)
అభిషేక్ శర్మ (3 బంతుల్లో 2 పరుగులు, నాటౌట్)

కోల్‌కతా బౌలింగ్
ఎస్పీ నరైన్ (4 ఓవర్లు, 31 పరుగులు)
సీవీ వరుణ్ (4 ఓవర్లు, 25 పరుగులు, 1 వికెట్)
కమిన్స్ (4 ఓవర్లు, 19 పరుగులు, 1 వికెట్)
శివమ్ మావి (2 ఓవర్లు, 15 పరుగులు)
కుల్దీప్ యాదవ్ (2 ఓవర్లు, 15 పరుగులు)
కేఎల్ నాగర్‌కోటి (2 ఓవర్లు, 17 పరుగులు)
రస్సెల్స్ (2 ఓవర్లు, 16 పరుగులు, 1 వికెట్)
Published by: Ashok Kumar Bonepalli
First published: September 26, 2020, 11:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading