IPL 2020 - KKR vs SRH: బోణీ కోసం ఇరు జట్ల ఆరాటం.. విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే..

IPL 2020 - KKR vs SRH: ఐపీఎల్ 2020 ప్రారంభమై ఇప్పటికే వారం రోజులు అయింది. ఇందులో కొన్ని మ్యాచ్‌లు మంచి రసవత్తరంగా సాగాయి. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో.. కొన్ని జట్లు శుభారంభాన్ని అందుకోగా.. మరికొన్ని జట్లు మాత్రం తొలి మ్యాచ్‌లో ఓటమిని తమ ఖాతాలో వేసుకున్నాయి.

news18-telugu
Updated: September 26, 2020, 1:34 PM IST
IPL 2020 - KKR vs SRH: బోణీ కోసం ఇరు జట్ల ఆరాటం.. విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే..
ఐపీఎల్ ట్రోఫీ
  • Share this:
ఐపీఎల్ 2020 ప్రారంభమై ఇప్పటికే వారం రోజులు అయింది. ఇందులో కొన్ని మ్యాచ్‌లు మంచి రసవత్తరంగా సాగాయి. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌ల్లో.. కొన్ని జట్లు శుభారంభాన్ని అందుకోగా.. మరికొన్ని జట్లు మాత్రం తొలి మ్యాచ్‌లో ఓటమిని తమ ఖాతాలో వేసుకున్నాయి. అలా ఓటమిని ఖాతాలో వేసుకున్న వాటిలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ రెండు జట్లు మధ్య నేడు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. ఈ ఐపీఎల్ సీజన్‌లో బోణీ కొట్టాలని ఇరు జట్లు ఆశిస్తున్నాయి. ఈ మేరకు ఇరు జట్లు తమ అస్త్రాలకు పదునుపెడుతున్నాయి. కేకేఆర్ జట్టు బలమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. హైదరబాద్ ఫేవరేట్స్‌గా బరిలో దిగనుంది.

ఆడిన తొలిమ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. మనీష్ పాండే, బెయిర్‌స్టో రాణించినప్పటికీ.. చివరి ఓవర్లలో ఏడుగురు ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇది ఇప్పుడు హైదరాబాద్‌ జట్టును కలవరానికి గురిచేస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో రనౌట్‌గా వెనుదిరిగిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మంచి ఆరంభాన్ని అదించగలిగితే.. కోల్‌కత్తాపై విజయం సాధించడం కష్టమేమి కాదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన మిషెల్ మార్ష్ టోర్ని నుంచి తప్పుకోవడంతో.. అతని స్థానంలో వెస్టిండీస్ అల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను తీసుకున్నట్టు సన్‌రైజర్స్ ప్రకటించింది. అయితే ఇప్పటికే యూఏఈ చేరకున్న హోల్డర్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. అతనికి మూడుసార్లు కరోనా నెగిటివ్‌గా నిర్దారణ అయితే జట్టులోకి తీసుకోనున్నారు. లేకపోతే మరో ఆటగాడు జట్టులో చోటు కల్పించనున్నారు. ఇక, సన్‌రైజర్స్‌కు.. వార్నర్‌తో పాటు కేన్‌ విలియమ్సన్‌, మనీష్‌ పాండే, జానీ బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌లు ఆ జట్టుకు ప్రధాన బలంగా కాగా, సిద్దార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ నబీల రూపంలో కూడా మంచి బౌలింగ్‌ లైనప్ ఉంది.మరోవైపు ఈ సారి స్ట్రాంగ్ టీమ్‌గా కనిపించినా కోల్‌కతా నైట రైడర్స్.. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలి నుంచి కోల్‌కతాపై ముంబై పై చేయి సాధిస్తూ వచ్చింది. బౌలింగ్ అంతగా ప్రభావం చూపలేకపోయినా.. నైట్ రైడర్స్ బ్యాటింగ్‌లో కూడా ఆకట్టుకోలేపోయారు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ కాసింత ప్రయత్నించినప్పటికీ.. మిగతా ఆటగాళ్లు నిలకడగా రాణించకపోవడంతో.. ఆ జట్టు ఓటమి పాలైంది. ఇక, నేటి పోరులో బ్యాటింగ్, బౌలింగ్‌ రెండింటిలో రాణించగలిగితేనే కోల్‌కతా జట్టు విజయం సాధించగలుగుతోంది. ఇక, ఓవరాల్‌గా సన్‌రైజర్స్‌కు బౌలింగ్ బలం కాగా, కేకేఆర్‌లో మంచి హిట్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా భువనేశ్వర్, రషీద్ ఖాన్‌లు బౌలింగ్‌ను కేకేఆర్ ఎలా ఎదుర్కొంటుందనే దానిపై కూడా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఇరు జట్లు అంచనా..
సన్ రైజర్స్: బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్(కెప్టెన్), మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, మహమ్మద్ నబీ, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టీ నటరాజన్

కోల్‌కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, శుభ్‌మన్ గిల్, దినేష్ కార్తీక్(కెప్టెన్), నితీష్ రానా, ఇయన్ మోర్గాన్, అండ్రీ రస్సెల్, నిఖిల్ నాయక్, ప్యాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, శివమ్ మాన్వి, సందీప్ వారియర్వేదిక: అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం
సమయం: సెప్టెంబర్ 26 రాత్రి 7 గంటలకు
Published by: Sumanth Kanukula
First published: September 26, 2020, 12:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading