ఐపీఎల్ 2020

  • associate partner

KKR vs RCB, IPL 2020 Live Score: టాస్ గెలిచిన మోర్గాన్.. జట్లలో మార్పులు ఇవే

IPL 2020, Kolkata Knight Riders vs Royal Challengers Bangalore Live Score: శివం మావి, ఆండ్రే రస్సెల్ స్థానంలో టామ్ బాంటన్, ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: October 21, 2020, 7:15 PM IST
KKR vs RCB, IPL 2020 Live Score: టాస్ గెలిచిన మోర్గాన్.. జట్లలో మార్పులు ఇవే
విరాట్ కొహ్లీ, ఇయాన్ మోర్గాన్ (Image;IPL)
  • Share this:
KKR vs RCB, IPL 2020 Live Score:  ఐపీఎల్‌ 2020 టోర్నీలో ఇవాళ 39వ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. శివం మావి, ఆండ్రే రస్సెల్ స్థానంలో టామ్ బాంటన్, ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. ఇక ఆర్సీబీ జట్టులో ఒకే ఒక్క మార్పు చేశారు. షాబాజ్ స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు.


జట్ల వివరాలు:

Royal Challengers Bangalore (Playing XI): దేవదత్ పడిక్కల్, అరోన్ ఫించ్, విరాట్ కొహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), గుర్‌కీరట్ సింగ్ మాన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఇసురు ఉడానా, మహమ్మద్ సిరాజ్, నవదీప్ సైని, యుజ్వేంద్ర చాహల్.

Kolkata Knight Riders (Playing XI): శుభమాన్ గిల్, టామ్ బాంటన్, నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, ప్యాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.


ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు ఇప్పటి వరకు 25 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ టీమ్ 14 సార్లు విజయం  సాధించగా..  ఆర్సీబీ జట్టు 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.అక్టోబరు 12న షార్జాలో ఇంతకు ముందు ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కతాపై బెంగళూరు జట్టు 82 పరుగులు చేసింది. ఆర్సీబీ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా టీమ్..20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 112 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచి కొహ్లీ సేనపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఐతే బెంగళూరు జట్టు కూడా.. కేకేఆర్‌ను మరోసారి ఓడించాలన్న పట్టుదలతో ఉంది.

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానలో ఉంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ సేన.. ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మూడింటిలో ఓటమి పాలయింది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆ జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా టీమ్.. 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
Published by: Shiva Kumar Addula
First published: October 21, 2020, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading