IPL 2020: హాఫ్ సెంచరీ కొట్టాక 'సురీందర్' జెర్సీ చూపించిన నితీష్.. ఎందుకో తెలుసా?

సురీందర్ జెర్సీని చూపిస్తున్న నితీష్ రాణా (Image:KKR)

IPL 2020: నితీష్ రాణా ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్.. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 మ్యాచ్‌లు గెలిచి.. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

  • Share this:
    IPL 2020: అబుదాబిలో ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఓపెనర్ నితీష్ రాణా అదరగొట్టాడు. 53 బంతుల్లో 81 పరుగులు చేసి సత్తా చాటాడు. తన ఇన్నింగ్స్‌లో ఒక సిక్స్, 13 ఫోర్లు ఉన్నాయి. ఐతే మీరు గమనించారో లేదో.. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత నితీష్ రాణా ఓ కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ జెర్సీని చూపించాడు. దానిసై సురీందర్ అని రాసి ఉంది. సాధారణంగా హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు బ్యాట్స్‌మెన్ రకరకాలుగా సెలబ్రేట్ చేసుకున్నారు. నితీష్ రాణా మాత్రం ఆ జెర్సీని చూపించాడు. మరి జెర్సీపై ఉన్న సురీందర్ ఎవరు? కోల్‌కతా జట్టులో ఆ పేరుతో ఏ ఆటగాడూ లేరు. మరి ఆయన ఎవరబ్బా? అని నెటిజన్లు వెతుకున్నారు. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమే దానికి సమాధానం చెప్పింది.

    సురీందర్.. నితీష్ రాణాకు పిల్లనిచ్చిన మామ. అతడి సతీమణి సాచ్చి మార్వా తండ్రి. కొంతకాలంగా క్యాన్స్‌ర్‌తో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఐతే యూఏఈలో ఐపీఎల్ ఆడుతుండడంతో మామను కడసారి చూడలేకపోయాడు నితీష్. ఈ క్రమంలోనే తన హాఫ్ సెంచరీని తన మామకు అంకింతం ఇచ్చాడని కేకేఆర్ టీమ్ తెలిపింది. నితీష్ రాణా జెర్సీ చూపిస్తున్న సమయంలో.. డగౌట్‌లో ఉన్న సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. కాగా, నితీష్ రాణా వివాహనం గత ఏడాది ఫిబ్రవరి 19న సాచ్చి మార్వాతో వివాహం జరిగింది.


    అబుదాబిలో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు.. 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. నితీష్ రాణా, సునీల్ నరైన్ అర్ధసెంచరీలతో మెరుపులు మెరిపించారు. నితీష్ 53 బంతుల్లో 81 (1 సిక్స్, 13 ఫోర్లు) పరుగులు, నరైన్ 32 బంతుల్లో 64 (4 సిక్స్‌లు, 6 ఫోర్లు) పరుగులు చేశాడు. శుభమాన్ గిల్ 9, రాహల్ త్రిపాఠి 13, దినేష్ కార్తీక్ 3 పరుగులు మాత్రమే చేయగలిగారు. చివర్లో కెప్టెన్ మోర్గాన్ కూడా చెలరేగియాడు. 9 బంతుల్లో 17 రన్స్ చేశాడు.

    కాగా, ఈ సీజన్‌లో కోల్‌కతా తరపున ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు (ఈ మ్యాచ్‌తో కలిపి) ఆడిన నితీష్ రాణా... 265 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోల్‌కతా టీమ్ టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడగా... అందులో 5 మ్యాచ్‌లు గెలిచింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 10 పాయింట్లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది మోర్గాన్ సేన. ఇవాళ్టి మ్యాచ్ ఫలితం రావాల్సి ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published: