Home /News /ipl /

IPL 2020 KINGS XI PUNJAB RAJASTHAN ROYALS THE FIRSTS TO LEAVE FOR UAE SA

IPL 2020: యూఏఈలో పెరుగుతున్న కేసులు.. ఆందోళనలో బీసీసీఐ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐపీఎల్‌ 13వ సీజన్‌ సెస్టెంబర్‌19 నుంచి దుబాయ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈవెంట్‌కు మరో కష్టం వచ్చి పడింది. కొద్ది రోజులుగా యూఏఈలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది.

    కోవిడ్ ప్రజ్వలనంతో ప్రజానీకం సంక్షుబీత వాతవారణంలోకి కురుకుపోతున్నారు. ఎక్కుడ దాగిన ఉన్న బయటకు ఈడ్చుకొచ్చి మరి అట్టుకుంటుంది కరోనా. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ విలయం సృష్టిస్తునే ఉంది. ఇప్పటికే ఈ మహమ్మారి కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా క్రీడారంగాన్ని చాప వేసుకుని మూలకు కూర్చునేలా చేసింది. అలాగే భారతీయులు అమితంగా ఇప్టపడే ఐపీఎల్ ఈవెంట్ జరగకుండా ఇన్నాళ్ళు ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టికేలకు యుఏఈ వేదికగా టోర్నీ నిర్వహించడానికి సిద్దమైన బోర్డుకు వైరస్ అడుగడుగున అవంతరాలు సృష్టిస్తునే ఉంది.

    ఐపీఎల్‌ 13వ సీజన్‌ సెస్టెంబర్‌19 నుంచి దుబాయ్‌లో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈవెంట్‌కు మరో కష్టం వచ్చి పడింది. కొద్ది రోజులుగా యూఏఈలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 365 కొత్త కేసులునమోదయ్యాయి. ఇప్పుడు అక్కడి పరిస్థితి కాస్త అదుపులోనే ఉన్నప్పటికి ఈవెంట్ ప్రారంభ సమయానికి కేసులు సంఖ్య పెరుగుతుందోమోనని బీసీసీఐ ఆందోళన చెందుతోంది.

    ఐపీఎల్‌కు ఇంకా నెలరోజులే గడువు ఉండగానే టీమ్స్ అన్ని సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు దుబాయ్‌కి బయలుదేరింది. వచ్చే వారం వరకు దాదాపు అన్ని జట్లు దుబాయ్‌లో అడుగు పెట్టానున్నాయి. పూర్తి బయో బబుల్ విధానంలో ఐపీఎల్ జరగనుంది. వైరస్ కారణంగా పలు కొత్త నిబంధనలకు అమలు చేయనున్నారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: UAE

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు