Home /News /ipl /

IPL 2020 JOFRA ARCHERS OLD TWEET GOES VIRAL AFTER DISMISSING CHRIS GAYLE ON 99 SK

Jofra Archer: ఆర్చర్‌కు భవిష్యవాణి తెలుసా? అవన్నీముందుగానే ఎలా చెప్పాడు?

జోఫ్రా ఆర్చర్ (Image:IPL)

జోఫ్రా ఆర్చర్ (Image:IPL)

Jofra Archer: ఇండియాలో లాక్‌డౌన్, CSK నుంచి రౌనా ఔట్‌తో పాటు ఐపీఎల్లో జరిగిన ఎన్నో సంఘటలను ముందే చెప్పాడు ఆర్చర్. నమ్మడం లేదా మీరే చూడండి.

  జోఫ్రా ఆర్చర్.. ఈ ఇంగ్లీష్ పేసర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఐపీఎల్ 2020లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్చర్.. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడి, 19 వికెట్లు తీశాడు. వేగంగా బంతులు విసరుతూ.. అవసరమైన సమయంలో వికెట్లు తీస్తూ.. జట్టులో కీలక భూమిక పోషిస్తున్నాడు. ఐతే సోషల్ మీడియాలో చర్చ జరిగేది.. మనోడి ప్రదర్శన గురించికాదు..! భవిష్య వాణి గురించి..! భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఆర్చర్‌కు ముందే తెలుస్తుందా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇండియాలో లాక్‌డౌన్, CSK నుంచి రైనా ఔట్‌తో పాటు ఐపీఎల్లో జరిగిన ఎన్నో సంఘటలను ముందే చెప్పాడు ఆర్చర్. నమ్మడం లేదా మీరే చూడండి.

  శుక్రవారం జరిగిన పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తన స్కోర్ 99 పరుగులు ఉన్నప్పుడు.. ఆఖరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆర్చర్ దెబ్బకు క్రిస్ గేల్ సెంచరీ తృటిలో చేజారింది. ఆ ఫ్రస్ట్రేషన్‌లో అతడు బ్యాట్‌ను విసిరేశాడు. ఐతే మ్యాచ్ అనంతరం జోఫ్రా ఆర్చర్ చేసిన ఓ పాత ట్వీట్ వైరల్‌గా మారింది. ''నాకు తెలుసు. నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడు 100ను చేరుకోలేడని'' అంటూ 2013 మార్చిలో ఆర్చర్ చేసిన ట్వీట్‌ను రాజస్థాన్ రాయల్స్ ట్విటర్ హ్యాండిల్ వెలుగులోకి తెచ్చింది. ఇది 100శాతం నిజమంటూ ట్వీట్ చేసింది.


  సెప్టెంబరు 27న రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ జరిగింది. సంజూ సామ్సన్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ వద్ద ఉన్న నికోలస్ పూరన్ అద్భుతంగా ఆపాడు. సిక్స్‌గా వెళ్తున్న బంతిని గాల్లోకి ఎగిరి.. లోపలికి నెట్టాడు. అనంతరం సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. ఇది కూడా ఆర్చర్ ముందే చెప్పాడని నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. 'సేఫ్ ఫ్లైట్ పూరన్' అంటూ 2013లో చేసిన ట్వీట్‌ను వైరల్ చేశారు.


  సెప్టెంబరు 22న రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌ల్లో CSK బౌలర్‌ లుంగి ఎంగిడిపై ఆర్చర్ విరుచుకుపడ్డాడు. అతడు వేసిన 19వ ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. ఆ ఓవర్లో ఏకంగా 30 పరుగులు వచ్చాయి. చివరకు 16 పరుగుల తేడాతో చెన్నై ఓడిపోయింది. ఐతే తాను నాలుగు వరుస సిక్స్‌లు బాదుతానన్న విషయాన్ని కూడా ఆర్చర్ ముందే చెప్పాడని సోషల్ మీడియా హోరెత్తింది. 2015 జనవరిలో '6666' అంటూ ఆర్చర్ చేసిన ట్వీట్‌ను నెటిజన్లు వైరల్ చేశారు.


  అంతేకాదు ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేష్ రైనా తప్పుకుంటాడన్న విషయాన్ని కూడా ఆర్చర్ ముందే చెప్పేశాడు. రైనా గురించి 2015లో చేసిన ట్వీట్స్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.  ఇక 2015లో జోఫ్రా ఆర్చర్ చేసిన మరో ట్వీట్ కూడా వైరల్‌గా మారింది. జనవరి 5 అంటూ అతడు చేసిన ట్వీట్‌ను అనుష్క శర్మ డెలివరీ డేట్‌కు ఆపాదించారు నెటిజన్లు. జనవరిలో మా ఇంట్లో కొత్త సభ్యుడు చేరుతున్నారని.. అనుష్క శర్మ, విరాట్ కొహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.


  వీటితో పాటు భారత్‌లో తొలిదశగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తారన్న విషయాన్ని కూడా ముందే చెప్పాడట. 'మూడు వారాల పాటు ఇంట్లో ఉండడం ఏ మాత్రం సరిపోదు.' అని 2017లో ఆర్చర్ చేసిన ట్వీట్‌ను నెటిజన్లు వైరల్ చేశారు. కరోనాను ఎదుర్కోవాలంటే.. 21 రోజుల లాక్‌డౌన్ సరిపోదని.. అతడు ముందే చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారు.

  వాస్తవానికి జోఫ్రా ఆర్చర్‌ చేసిన ఆ ట్వీట్లు యాధృచ్చికమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులకు చక్కగా సరిపోవడంతో.. నెటిజన్లు ట్వీట్ల మోత మోగిస్తున్నారు. నువ్వు దేవుడివి సామీ.. అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నీకు ముందే అన్నీ ఎలా తెలుస్తున్నాయని కామెంట్స్ పెడుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: IPL, IPL 2020, Rajasthan Royals

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు