దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ మొదలయింది. శనివారం నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభమవడంతో ఎక్కడ చూసినా క్రికెట్ సందడే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్ వేళ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది జియో. ఈసారి కూడా క్రికెట్ ఫ్యాన్స్‌కు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' ప్లాట్‌ఫామ్‌ని తీసుకొచ్చింది. మై జియో యాప్‌లో ఇది కనిస్తుంది. మ్యాచ్ జరిగే సమయంలో క్విజ్లు నిర్వహిస్తారు. సరైన సమాధానం చెప్పిన వారికి ప్రైజ్‌లు ఇస్తారు. తమ క్రికెట్ స్కిల్స్ ఉపయోగించి ప్రతి క్వశ్వన్కి ఆన్సర్ చెప్పి ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోవచ్చు.
అంతేకాదు మ్యాచ్‌కు ముందు ప్రీ-మ్యాచ్ క్వశ్చన్స్, పోల్స్, క్విజ్ కూడా ఉంటుంది. ఆ రోజు మ్యాచ్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇవాళ ఆ జట్టు గెలుస్తుందా? పలనా ఆటగాడు అర్ధ సెంచరీ చేస్తాడా? అని ప్రశ్నలు ఉంటాయి. ఇక మ్యాచ్ జరిగే సమయంలో లైవ్ చాట్ ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా స్టిక్కర్స్ పంపుతూ మీ అభిమాన జట్టును ప్రోత్సహించవచ్చు. ఇక్కడ లైవ్ స్కోర్, మ్యాచ్ షెడ్యూల్, ఫలితాలు మరెన్నో వివరాలు అందుబాటులో ఉంటాయి.
వీటితో పాటు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్'లో బ్యాటర్ ఛాలెంజ్, ఫీల్డర్ ఛాలెంజ్ అనే రెండు గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాటర్ ఛాలెంజ్‌లో మీ జట్టు, ప్రత్యర్థి జట్టును ఎంచుకొని బ్యాటింగ్ చేయవచ్చు. ఇక ఫీల్డర్ ఛాలెంజ్ గేమ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బంతులను క్యాచ్ పట్టాల్సి ఉంటుంది. టీవీలో మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూనే.. ఈ రెండో గేమ్స్‌తో కాలక్షేపం చేయవచ్చు. ఇలా క్విజ్, గేమ్ ఆడి పాయింట్లు సాధిస్తే... మంచి మంచి గిఫ్ట్‌లు సాధించవచ్చు.
ఈ కరోనా సమయంలో ఇంట్లోనే ఉంటూ..' జియో క్రికెట్ ప్లే ఎలాంగ్'ను ఎంజాయ్ చేస్తూ అద్భుతమైన బహమతులను గెలుచుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్‌లో మై జియో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లోని జియో ఎంగేజ్ సెక్షన్లో 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' కనిస్తుంది. జియో యూజర్లతో పాటు నాన్ జియో యూజర్లు కూడా ఈ గేమ్స్ ఆడవచ్చు. ఇంకెందకు ఆలస్యం మీరు కూడా జియో యాప్ డౌన్లోడ్ చేసి జియో క్రికెట్ ప్లేను ఆస్వాదించండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.