ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: కొన్ని గంటల్లో మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్

మరికొన్ని గంటల్లో ఢిల్లీ క్యాపిటల్స్ , కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది.

news18-telugu
Updated: September 20, 2020, 4:29 PM IST
IPL 2020: కొన్ని గంటల్లో మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు (Image;DelhiCapitals/Twitter)
  • Share this:
మరికొన్ని గంటల్లో ఢిల్లీ క్యాపిటల్స్ , కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఢిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మకు గాయమైంది. శనివారం ట్రైనింగ్ సందర్భంగా ఇషాంత్ గాయపడ్డాడు. అయితే, మ్యాచ్ సమయానికి పరిస్థితిని బట్టి అతడ్ని తుది జట్టులో తీసుకోవాలా? వద్దా అనేది నిర్ణయించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యుడొకరు ఏఎన్‌ఐ వార్తా సంస్థకు నిర్ధారించారు. ‘నిన్న ట్రైనింగ్ సందర్భంగా అతడు గాయపడ్డాడు. అయితే, ఎలా ముందుకెళ్లాలనేది చూస్తున్నాం. మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడి గాయం తీవ్రతను అంచనా వేస్తాం. దాన్ని బట్టి అంతిమ నిర్ణయం తీసుకుంటాం. మాకు మెడికల్ టీం ఉంది. దీనిపై మెడికల్ టీం నిర్ణయం తీసుకుంటుంది.’ అని జట్టు సభ్యుడు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో కాలి మడమ గాయం కారణంగా ఇషాంత్ శర్మ సైడ్ లైన్ అయిపోయాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 20, 2020, 4:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading