news18-telugu
Updated: November 10, 2020, 8:08 PM IST
ట్రెంట్ బౌల్ట్ (Image:IPL)
IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్ దూకుడు మీదుంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండడంతో పాటు క్వాలిఫైయర్-1లో విజయం సాధించి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇప్పటికే నాలుగు సార్లు ట్రోఫీ గెలిచి.. ఐదోసారి కూడా అందుకోవాలని పట్టుదలతో ఉంది. ముంబై విజయాల్లో ఆ జట్టు పేసర్లు జాస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జట్టుకు అవసరమైన సమయాల్లో వికెట్లు తీసి జట్టును విజయ తీరాలకు చేర్చుతున్నారు. ఇందులో ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ ప్రదర్శన.. అద్భుతం.. అమోఘం..! వేసిన తొలి ఓవర్లో వికెట్ తీసి టీమ్‌లో కొత్త జోష్ నింపుతాడు. ఇవాళ్లి ఫైనల్ మ్యాచ్‌లో కూడా తొలి బంతికే వికెట్ తీసి సత్తా చాటాడు బోల్ట్.
మొదటి ఓవర్ మొదటి బంతికే ఢిల్లీ క్యాపిటల్స్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ మార్కుస్ స్టోనియిస్ను ట్రెంట్ బోల్ట్ ఔట్ చేశాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఫస్ట్ బాల్కే వికెట్ తీసి ముంబై టీమ్‌కు శుభారంభం అందించాడు. ఆ వికెట్ అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. బోల్ట్ గురించి ట్వీట్ చేశాడు. ''ట్రెంట్ బౌల్ట్.. ఫస్ట్ ఓవర్ వికెట్.. వీరిద్దరిది అద్భుతమైన లవ్ స్టోరీ''. అంటూ పేర్కొన్నారు పఠాన్.
ఆ ట్వీట్‌ను ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తున్నారు. అవును ఫస్ట్ ఓవర్ ఫస్ట్ వికెట్ లవ్ స్టోరీయే ముంబై ఇండియన్స్ సక్సెస్ సీక్రెట్ అని కామెంట్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2020 టోర్నీలో ట్రెంట్ బౌల్ట్ కేక పెట్టిస్తున్నాడు. కుర్రాళ్ల కన్నా మెరుగ్గా రాణిస్తూ.. ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ.. బుమ్రాతో పోటీపడి వికెట్లు తీస్తున్నాడు. బ్యాటింగ్‌కు కీలకమైన పవర్ ప్లేలో వికెట్లు పడగొడుతూ.. ప్రత్యర్థి జట్లను దెబ్బ తీస్తున్నాడు. క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో కూడా అద్భుతమైన బంతులు వేసి.. ఆరంభంలోనే రెండు వికెట్లు తీశాడు. తాను వేసిన తొలి ఓవర్లోనే పృథ్వీషా, అజింక్య రహానేను డకౌట్ చేశాడు.
ORANGE CAP:
PURPLE CAP:
కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ్టి మ్యాచ్‌తో కలిపి 15 మ్యాచ్‌లు ఆడాడు ట్రెంట్ బోల్ట్. ఇందులో 18.79 సగటుతో 24 వికెట్లుతీశాడు ట్రెంట్ బౌల్ట్. ఒకసారి 4 వికెట్లు తీశాడు. అంతేకాదు ఈసారి పర్పుల్ క్యాప్ రేస్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ బౌలర్ రబడ 29 వికెట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. 27 వికెట్లతో ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 10, 2020, 8:02 PM IST