Home /News /ipl /

IPL 2020 IN PICS A LOOK AT SUNRISERS HYDERABADS ROAD TO PLAY OFFS SA

SRH vs RCB: ఫేవరేట్‌గా పన్‌రైజర్స్.. అతనిపైనే ఆర్సీబీ జట్టు భారం..

మనీష్ పాండే (Image:IPL)

మనీష్ పాండే (Image:IPL)

ఐపీఎల్ 2020 మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు ఎలిమినేటర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.

    ఐపీఎల్ 2020 మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు ఎలిమినేటర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2 ఆడనుంది. ఈ సారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలని ఆర్సీబీ ప్రయత్నిస్తుంటే.. రెండో టైటిల్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ గురిపెట్టింది. రెండు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి దారి పడుతుంది. విజయం సాధించిన జట్టు ఢిల్లీతో జరిగే రెండో క్వాలిఫయర్‌ తలపడుతుంది.

    లీగ్ ఆరంభంలో తడబడుతూ వచ్చిన సన్‌రైజర్స్‌ ఎట్టికేలకు విన్నింగ్ ట్రాక్ ఎక్కింది. జట్టు కూర్పులో తీసుకున్న నిర్ణయాలు ఆ జట్టును విజయాల బాట పట్టించాయి. ఓపెనర్‌గా సాహా అద్భుతంగా రాణిస్తున్నాడు. చివరి మూడు ఇన్నింగ్స్‌లలో 87, 39,58 * ఆహా అనిపించే ఆటతీరుతో కనబరిచాడు. అలాగే స్టంప్స్ వెనుక అసాధారణమైన పాత్ర పోషించాడు. మరో ఆటగాడు హోల్డర్ కూడా అద్భుతంగా ఆడాడు. ఐదు మ్యాచ్‌ల్లో పది వికెట్లు తీసి శభాష్ అపిపించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 10 బంతుల్లోనే 26 రన్స్‌ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకున్నాడు. కొత్త బాల్‌తో బౌలింగ్ అద్భుతంగా చేశాడు. హోల్డర్‌ ఐదు మ్యాచులు ఆడితే.. సన్‌రైజర్స్ వాటిలో నాలుగు విజయాలు సాధిచింది. అందులో పంజాబ్‌పై గెలుపు అంచులవరకు వెళ్ళి ఒత్తిడిలో మ్యాచ్ చేజార్చుకుంది.వీరితో పాటు మిడిలార్డర్‌లో పాండే, విలియమ్సన్, సమద్‌ చేలరేగితే జట్టుకు విజయం ఖాయం.

    ఆర్సీబీ ఆదరగోడుతుందా...

    ఆరంభంలో ఆదరగొట్టిన చివరిలో చతికిలాపడింది. ప్రస్తుత బెంగళూరు పరిస్థితి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నాలుగు వరుస ఓటములతో జట్టు కొంత నైరాశ్యంలో కనిపిస్తోంది. బ్యాటింగ్‌ సమస్య ఆ జట్టును వేధిస్తోంది. డివిలియర్స్‌పై బ్యాటింగ్ పైనే అతిగా ఆధాపడుతుండటం, కోహ్లి,మిగితా బాట్స్‌మెన్స్ స్థాయికి తగిట్టుగా ఆడకపోవడం జట్టుకు లోపంగా మారింది. ఓపెనర్స్ మంచి శభారంభాన్ని ఇవ్వలేకపోతున్నారు. పడిక్కల్‌ కాస్త పర్వాలేదనిపిస్తున్నాడు. ఏబీ, కోహ్లిల నిష్క్రమణ తర్వాత జట్టు బ్యాటింగ్ పూర్తిగా విఫలమవుతుంది. బౌలింగ్ విభాగానికి వస్తే స్పిన్నర్లు సుందర్, చహల్‌ ఆడదడప రాణిస్తున్నారు. ఇక ఫాప్ట్ బౌలర్స్‌ను గాయాలు వేధిస్తున్నాయి. మోరిస్, సైనీ ఇంజ్యూర్సీతో భాదపడుతున్నారు. సిరాజ్‌ కొంత మెర్గుగానే రాణిస్తున్నాడు.
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: IPL 2020, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు