Home /News /ipl /

IPL 2020 IMPACT OF JASON HOLDER AFTER INCLUDING IN THE SUNRISERS HYDERABAD TEAM SA

వేలంలో హోల్డర్‌ను కొనుగొలు చేయని సన్‌రైజర్స్.. అయినా జట్టులోకి ఎలా వచ్చడంటే!

Jason Holder

Jason Holder

నిజానికి ఐపీఎల్ 2020 వేలంలో హోల్డర్‌ను సన్‌రైజర్స్ కొనుగోలుచేయలేదు. మిచెల్‌ మార్ష్‌ స్థానంలో హోల్డర్‌ను తీసుకున్నది.అనుహ్యంగా జట్టులోకి వచ్చిన అడుగు పెట్టినా అతను అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరోసారి తన పోరాట పటిమను చూపింది. ప్రతి ఐసీఎల్‌లో అరంభంలో తడబడడం చివరిలో అదరగొడుతూ టోర్నీలో సన్‌రైజర్స్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఐపీఎల్ 2020లో ప్రారంభంలో తడబడుతూ.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి ప్లేఆఫ్‌కు చేరింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌లో స్థాయి తగ్గట్టుగా రాణించి సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్‌ చేరింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌లపై ఘన విజయాలు సాధించి ప్లేఆఫ్‌ బెర్త్ ఖరారు చేసుకుంది.

    పంజాబ్‌పై 127 పరుగులు కూడా ఛేదించలేక చేతులెత్తేసి.. ప్లేఆఫ్‌కు అవకాశాలు చేజార్చుకున్నట్లు కనిపించిన జట్టు.. తర్వాత సింహాల గర్జించి వరుస విజయాలను నమోదు చేసుకుని టాప్ 4లో నిలిచింది. జట్టు ఇంతలా పుంజుకుందంటే దానికి కారణం సాహా,జాసన్ హోల్డర్‌‌లు జట్టుకు అండగా నిలవడమే.. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్ససన్, రషీద్ ఖాన్‌లతో పాటు వీరు కూడా అద్భుతంగా రాణించడంతో సన్‌రైజర్స్ ఫ్లేఆఫ్ వరకు చేరింది.

    ముఖ్యంగా వృద్ధిమాన్ సాహ, జాసన్ హోల్డర్ లేటుగా వచ్చిన లెటెస్ట్‌గా ఆడారు. బౌలింగ్‌లో హోల్డర్‌ ఆకట్టుకుంటే.. బ్యాటింగ్ సహా ఆదరగొట్టారు. హోల్డర్ ఐదు మ్యాచ్‌ల్లో పది వికెట్లు తీసి శభాష్ అపిపించాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 10 బంతుల్లోనే 26 రన్స్‌ బాది పంజాబ్ మ్యాచ్‌లో జరిగిన చెదు అనుభావాన్ని రీపిట్ కాకుండా చూశాడు. మూడు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకున్నాడు. కొత్త బాల్‌తో బౌలింగ్ అద్భుతంగా చేశాడు. హోల్డర్‌ ఐదు మ్యాచులు ఆడితే.. సన్‌రైజర్స్ వాటిలో నాలుగు విజయాలు సాధిచింది. అందులో పంజాబ్‌పై గెలుపు అంచులవరకు వెళ్ళి ఒత్తిడిలో మ్యాచ్ చేజార్చుకుంది.

    నిజానికి ఐపీఎల్ 2020 వేలంలో హోల్డర్‌ను సన్‌రైజర్స్ కొనుగోలుచేయలేదు. మిచెల్‌ మార్ష్‌ స్థానంలో హోల్డర్‌ను తీసుకున్నది.అనుహ్యంగా జట్టులోకి వచ్చిన అడుగు పెట్టినా అతను అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్ లేని లోటును పూడ్చాడు. అతనితో పాటు సహా చివరి మూడు ఇన్నింగ్స్‌లలో 87, 39,58 * ఆహా అనిపించే ఆటతీరుతో కనబరిచాడు. అలాగే స్టంప్స్ వెనుక అసాధారణమైన పాత్ర పోషించాడు.
    Published by:Rekulapally Saichand
    First published:

    తదుపరి వార్తలు