IPL 2020: ఈసారి కూడా కప్ మాదే.. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ ధీమా

హార్దిక్ పాండ్యా (Image:IPL)

క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గెలిస్తే ముంబై ఇండియన్స్ డైరెక్టుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

 • Share this:
  ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ కీలక మ్యాచ్ జరగబోతోంది. దుబాయ్ వేదికగా తొలి క్యాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ క్రమంలో ముంబై ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టైటిల్ విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా నాలుగు సార్లు విజేతగా నిలిచిన ముంబై.. ఈసారి కూడా కప్పు గెలుస్తుందని స్పష్టం చేశాడు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఈసారి అద్భుతంగా రాణించారని.. ఇంతకు మించి ఎక్కువగా ఆశించలేమని తెలిపాడు హార్దిక్ పాండ్యా. ముంబై జట్టు షేర్ చేసిన వీడియో ఈ వ్యాఖ్యలు చేశాడు.

  '' ఐపీఎల్ టోర్నీ ఇప్పటివరకు అంతా బాగా సాగింది. ప్రతీ ఒక్కరు రాణిస్తుండడంతో అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పుడు అసలైన పోరుకు సమయమైంది. టోర్నీలో కీలక దశకు చేరుకున్నాం. మేం కప్పు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నా.'' అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.


  ముంబయి ఇండియన్స్ జట్టు ఇప్పటికే నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 2013, 2015, 2017, 2019లో పొట్టి క్రికెట్ విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ పలు మ్యాచ్‌లకు దూరమైనా.. తాత్కాలిక కెప్టెన్‌గా పొలార్డ్ విజయవంతమయ్యాడు. ఈ టోర్నీలో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై టీమ్.. 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో ఐదింట ఓడిపోయంది. 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడబోతోంది ముంబై ఇండియన్స్.
  POINTS TABLE:  ORANGE CAP:


  PURPLE CAP:

  క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో గెలిస్తే ముంబై ఇండియన్స్ డైరెక్టుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
  Published by:Shiva Kumar Addula
  First published: