• HOME
  • »
  • NEWS
  • »
  • IPL
  • »
  • IPL 2020 HE CAN BEVER BE MS DHONI GAUTAM GAMBHIR WANTS PEOPLE TO STOP COMPARING RISHABH PANT WITH MSD SK

IPL 2020: అతడు ఎప్పటికీ ధోనీ కాలేడు.. గౌతమ్ గంభీర్ గరం గరం..

IPL 2020: అతడు ఎప్పటికీ ధోనీ కాలేడు.. గౌతమ్ గంభీర్ గరం గరం..

ఎంఎస్ ధోనీ, గౌతం గంభీర్

IPL 2020: ఐపీఎల్ టోర్నీలో విఫలమవ్వడం వల్లే ఆస్ట్రేలియా టూర్‌కు అతడిని ఎంపిక చేయలేదు. కీపర్‌గా కేఎల్ రాహుల్, సంజూ శామ్సన్‌ను ఎంపిక చేశారు.

  • Share this:
    టీమిండియాలో ధోనీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై చెప్పిన తర్వాత దీని గురించే క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో ధనాధన్ బ్యాటింగ్ చేయలగల సత్తా ఎవరికుంది? ధోనీ వారసుడిగా ఎవరు రాబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. ఎక్కువ మంది రిషభ్ పంత్ పేరును ప్రస్తావించారు. ధోనీలా భారీ సిక్సర్లతో మ్యాచ్ ఫినిష్ చేసే సత్తా ఉందని, వికెట్ కీపింగ్ కూడా అద్భుతంగా చేస్తాడని అభిప్రాయపడ్డారు. జూనియర్ ధోనీ అంటూ పంత్‌పై ప్రశంసలు కురపించారు. మరికొందరు మాత్రం సంజూ శామ్సన్, వృద్ధిమాన్ సాహా పేర్లను సూచించారు.

    ఐతే రిషభ్ పంత్‌ను ధోనీతో పోల్చడంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తప్పుబట్టారు. ESPNcricinfoతో మాట్లాడిన ఆయన..పంత్‌ను ధోనీతో పోల్చకూడదని ఇటు అభిమానులు, అటు మీడియాకు సూచించారు. ''మొట్ట మొదట మీరు పంత్‌ని ధోనీతో పోల్చడం ఆపేయండి. మీడియా చేయాల్సిన పని ఇదొక్కటే. మీడియా ఎంత ఎక్కువగా దీని గురించి మాట్లాడితే పంత్ కూడా అంత ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తాడు. అతడు ఎప్పటికీ ధోనీ కాలేడు. రిషభ్ పంత్‌లానే ఉండాలి. బ్యాటింగ్, కీపింగ్‌లో ఇంకా బాగా రాణించాలి.'' అని పేర్కొన్నారు గౌతమ్ గంభీర్.

    ధోనీ లాగే భారీ సిక్సర్లు కొట్టడంతో చాలా మంది పంత్‌ను అతడితో పోల్చుతున్నారని గంభీర్ అన్నారు. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్ విషయంలో పంత్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, పంత్ ఎన్నో సార్లు ధోనిని అనుకరించి బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. ధోనీలా స్టంప్స్ కొట్టడం, ధోనీలా రనౌట్ చేయడం, చూడకుండానే వికెట్లకు బంతిని గిరాటేయం వంటివి చేసి.. విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ధోనీతో పోల్చవద్దని హితవు పలికారు గంభీర్. అప్పుడే పంత్.. పంత్‌లా ఆడగలడని అభిప్రాయపడ్డారు.

    కాగా, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న రిషభ్ పంత్.. ఆశించిన మేర రాణించడం లేదు. టోర్నీలో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడగా.. 28.50 సగటుతో 285 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క అర్ధ సెంచరీ కూడా సాధించలేదు. అత్యధిక స్కోర్ 38. ఈ టోర్నీలో విఫలమవ్వడం వల్లే ఆస్ట్రేలియా టూర్‌కు అతడిని ఎంపిక చేయలేదు. కీపర్‌గా కేఎల్ రాహుల్, సంజూ శామ్సన్‌ను ఎంపిక చేశారు.

    ORANGE CAP:


    PURPLE CAP:

    ఇక తొలి క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. నవంబరు 8న క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ ఆడబోతోంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తలపడనుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు