IPL 2020 GOVERNING COUNCIL MEETING TO CONFIRM SCHEDULE
IPL2020: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేది ఆ రోజే.. ముగిసిన గంగూలీ పదవి కాలం
IPL CHENNAI SUPER KINGS
ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఆగస్టు 2న టోర్నీ పాలకమండలి సమావేశం కానుంది. ఆ రోజే పూర్తి షెడ్యూల్‌తో సహా పలు నిర్ణయాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.
ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఆగస్టు 2న టోర్నీ పాలకమండలి సమావేశం కానుంది. ఆ రోజే పూర్తి షెడ్యూల్‌తో సహా పలు నిర్ణయాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో ఈవెంట్ జరగనున్నట్లు ఇప్పటికే వివరించిన ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సమావేశం అనంతరం మరిన్ని విషయాలను మీడియాకు వివరించనున్నారు. ఎనిమిది జట్లు 50 రోజుల పాటు 60 మ్యాచ్‌లు ఆడే విధంగా ఇప్పటికే ప్రణాళిక రూపొదించింది బీసీసీఐ.
యుఏఈలో ఆటగాళ్ళ భద్రతా,ప్రాక్టిస్, వసతి సౌకర్యాలు వంటి అంశాలపై మీటింగ్‌లో లోతుగా చర్చించనున్నారు. అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కడికి చేరుకునే ప్లేయర్స్‌ను క్వారెంటైన్ ఉంచడానికి కావాల్సిన ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్‌తో పాటు కార్యదర్శి జై షా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అయితే గంగూలీ,జై షా పదివికాలం నేటితో ముగియనుంది.వారిద్దరూ పదివిపై సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై అందరూ ఎదురుచూస్తున్నారు.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.