ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: క్రికెట్ ఫ్యాన్స్‌పై హర్భజన్ భార్య తీవ్ర ఆగ్రహం.. మాకేం సంబంధం..?

హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సురేష్ రైనాతో పాటు హర్భజన్ సింగ్ కూడా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దూరమయ్యాడు.

news18-telugu
Updated: October 21, 2020, 7:19 PM IST
IPL 2020: క్రికెట్ ఫ్యాన్స్‌పై హర్భజన్ భార్య తీవ్ర ఆగ్రహం.. మాకేం సంబంధం..?
హర్భజన్ సింగ్, గీతా బస్రా
  • Share this:
మన దేశంలో ఏ గేమ్‌కూ లేనంత క్రేజ్.. క్రికెట్‌కు ఉంది. ఏదైనా టోర్నమెంట్ జరుగుతుందంటే.. స్టేడియం కిక్కిరిసిపోతుంది. అందరూ టీవీలకు అతుక్కుపోతారు. క్రికెట్‌ను ఎంతో ఆరాధించే అభిమానులు.. గెలుపోటములను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. మ్యాచ్‌ను గెలిపిస్తే నీ అంత గొప్పోడు లేడంటూ ఆకాశానికెత్తేస్తారు. అదే ఓడిపోతే పాతాళానికి పడేస్తారు. కేవలం విమర్శలే కాదు.. బూతులు తిడతారు. సోషల్ మీడియా వేదికగా చుక్కలు చూపిస్తారు. కేవలం ఆటగాళ్లే కాదు.. వారి కుటుంబ సభ్యులపైనా మండిపడతారు. మీ వల్లే సరిగ్గా ఆడడం లేదంటూ భార్యలను బద్నాం చేస్తారు. మ్యాచ్‌ల గెలుపోటములకు క్రికెటర్ల భార్యలను బాధ్యుల చేసే అభిమానులపై హర్భజన్ సింగ్ భార్య గీతా బస్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'' క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించే అభిమానులకు క్షమాగుణం ఉండాలి. వేరొకరిని బలిపశువు చేయకూడదు. చాలా మంది అభిమానులు క్రికెటర్ల భార్యలు, గర్ల ఫ్రెండ్స్‌ని చాలా ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. మీ వల్లే అతడి ఆట పాడవుతోందని విమర్శిస్తున్నారు. బాగా ఆడినప్పుడు మెచ్చుకోని వారు.. వైఫల్యం చెందినప్పుడు మాత్రం వారి భార్యలను బాధ్యులను చేస్తారు. మేం మా భర్తల కోసం కోసం ఆడడం లేదు. టీమ్‌లో సభ్యులం కూడా కాదు. మేం శిక్షణ ఇవ్వం. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు అనాలి. కొంత మందికి నెగెటివ్ జోన్‌లోకి వెళ్లి అవతలి వారిని విమర్శించడం చాలా తేలిక. ప్రశంస కంటే విమర్శలు, నిందలు, శాపాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది చాలా తప్పు.'' అని గీతా బస్రా పేర్కొన్నారు.

గీతా బస్రా భర్త హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సురేష్ రైనాతో పాటు హర్భజన్ సింగ్ కూడా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దూరమయ్యాడు. కాగా, 2008లో ఐపీఎల్ ఆరంభ సీజన్‌ నుంచి ఆడుతున్న హర్భజన్ సింగ్ ఈ సారి మాత్రమే ఆడడం లేదు. టర్బనేటర్ భజ్జీ ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌లు ఆడాడు. 7.05 ఎకనామీతో 150 వికెట్లు సాధించాడు. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో 829 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది.

ఇటీవల హర్భజన్ సింగ్‌ను ధోనీ ఫ్యాన్స్ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఓ మ్యాచ్‌లో అంపైర్‌ని తన సైగలతో ప్రభావితం చేసి.. వైడ్ ఇవ్వకుండా ఆపాడని చాలా మంది నెటిజన్లు ధోనీని విమర్శించారు. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. హర్భజన్ నవ్వుతున్న ఎమోజీని పెట్టాడు. ఆ ట్వీట్ ధోనీ అభిమానులకు నచ్చలేదు. సొంత టీమ్‌కు సపోర్ట్ చేయకుండా.. ధోనీపై సెటైర్లు వేస్తావా అంటూ సీఎస్‌కే ఫ్యాన్స్ మండిపడ్డారు. భజ్జీ పాము లాంటోడదని జట్టు నుంచి వెళ్లిపోయి మంచి పని చేశాడని విమర్శలు గుప్పించారు. ఆ ట్రోలింగ్‌పై హర్భజన్ కూడా ఘాటుగా స్పందిచాడు. పందులతో కుస్తీ పడితే మనకే బురద అంటుకుంటుందని ట్వీట్ చేసి.. ఎదురు దాడికి దిగారు. దీనిపై రచ్చ జరుగుతున్న క్రమంలోనే తాజాగా గీతా బస్రా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
Published by: Shiva Kumar Addula
First published: October 21, 2020, 6:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading