ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఐపీఎల్ ఫైనల్ కాదు.. వరల్డ్ కప్ ఫైనల్.. అంత గొప్ప మ్యాచ్..

ఐపీఎల్ ఫైనల్ నేపథ్యంలో కీరన్ పొలార్డ్, కోచ్ మహేల జయవర్దనే మాట్లాడిన వీడియోను ముంంబై ఇండియన్స్ టీమ్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

news18-telugu
Updated: November 10, 2020, 4:11 PM IST
IPL 2020: ఐపీఎల్ ఫైనల్ కాదు.. వరల్డ్ కప్ ఫైనల్.. అంత గొప్ప మ్యాచ్..
కీరన్ పొలార్డ్
  • Share this:
ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 07.30 గంటలకు దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ముంబై మళ్లీ కప్ గెలుస్తుందా? లేదంటే ఢిల్లీ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టిస్తుందా? అని ఎవరిక వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 ఫైనల్ గురించి ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత అంత గొప్ప ఫైనల్ మ్యాచ్‌ అని అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ ఫైనల్ నేపథ్యంలో కీరన్ పొలార్డ్, కోచ్ మహేల జయవర్దనే మాట్లాడిన వీడియోను ముంంబై ఇండియన్స్ టీమ్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.  ''ఫైనల్ అంటేనే ఒత్తిడి. ప్రతీ ఒక్కరు ఒత్తిడికి గురవుతారు. విజయం దక్కాలంటే ఏ  చిన్న తప్పిదం కూడా చేయకూడదు. మన వంతు ప్రయత్నం మనం చేయాలి.  సాధారణ మ్యాచ్‌లానే పరిగణించాలి.  ఎప్పటిలాగా మమూలుగానే మైదానంలోకి బరిలోకి దిగి ఆటను ఆస్వాదించాలి. వాస్తవానికి ఈ టోర్నీలో ప్రేక్షకులు లేరు. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత అంత గొప్పగా భావించే ఫైనల్ మ్యాచ్ ఇది. '' అని పొలార్డ్ పేర్కొన్నారు.

ముంబై ఇండియన్స్ టీమ్ కోచ్ జయవర్దనే మాట్లాడుతూ.. క్రికెట్‌లో అన్ని మ్యాచ్‌ల్లాగే ఇది కూడా ఒక గేమ్ మాత్రమే. మేం ఎక్కువగా ఆలోచించడం లేదు. మా విధానాలను కొనసాగిస్తూ నైపుణ్యాలను ప్రదర్శిస్తాం. ఇది కేవలం బ్యాట్, బాల్, పరుగులు, వికెట్ మధ్య జరిగే ఆసక్తిపోరు మాత్రమే. ఈ కాంటెస్ట్‌ను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాం' అని పేర్కొన్నారు.

కాగా, ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించింది. లీగ్ దశతో పాటు ప్లేఆఫ్స్‌లోనూ అదరగొట్టి.. ఫైనల్‌కు చేరుకుంది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచిన రోహిత్ సేన.. క్వాలిఫైయర్-1లో ఢిల్లీని ఓడించి ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీని ఢీకొట్టబోతోంది.
Published by: Shiva Kumar Addula
First published: November 10, 2020, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading