IPL 2020: దినేష్ కార్తీక్ కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో చెప్పిన మోర్గాన్

దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్

కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ స్థానంలో ఇంగ్లాడ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ నియమితులైన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ఈ మార్పు చోటుచేసుకుంది.

  • Share this:
    కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్ స్థానంలో ఇంగ్లాడ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ నియమితులైన సంగతి తెలిసిందే. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ఈ మార్పు చోటుచేసుకుంది. అయితే కార్తీక్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకోవడంపై మోర్గాన్ స్పందించారు. ముంబైతో మ్యాచ్‌కు ముందు టాస్ సందర్భంగా మోర్గాన్ మాట్లాడుతూ.. దినేష్ కార్తీక్ తీసుకున్న నిర్ణయం చాలా నిస్వార్థమైందని అన్నాడు. అలాగే కోల్‌కతా జట్టు యజమాన్యంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగళ్లు తమ అభిప్రాయలను స్వేచ్ఛగా వెల్లడించే వాతావరణం కోల్‌కతా ప్రాంచైజ్ తమకు ఇచ్చిందన్నారు.

    "దినేష్ కార్తీక్ ముంబైతో మ్యాచ్‌కు ముందు రోజు తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాడు. బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది చాలా నిస్వార్ధమైన నిర్ణయం. ఇలా చేయడానికి చాలా ధైర్యం కావాలి.. అది కార్తీక్‌లో ఉంది. జట్టు ప్రయోజనాలకు అతడు మొదటి ప్రాధన్యత ఇస్తాడు"అని మోర్గాన్ తెలిపాడు.

    ప్రపంచ స్థాయి జట్టుకు డ్రెసింగ్ రూమ్‌లో మంచి నాయకులు అవసరమని.. కేకేఆర్ జట్టుకు అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని పేర్కొన్నాడు. జట్టుకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉందని చెప్పాడు.  మోర్గాన్.. ముంబైతో మ్యాచ్ ముందు వరకు కోల్‌కతా జట్టు వైస్ కెప్టెన్‌గా కొనసాగాడు. ఇక, మోర్గాన్ కెప్టెన్‌గా ఇంగ్లాడ్ జట్టు ప్రపంచకప్ అందుకున్న సంగతి తెలిసిందే.

    ఇక, 2018లో దినేష్ కార్తీక్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్ జట్టు.. అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే గత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ ఆశించిన మేర ప్రదర్శన కనబరచని సంగతి తెలిసిందే. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్.. నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

    శుక్రవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కమిన్స్ 53 పరుగులు, మోర్గాన్ 38 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన ముంబై.. 16.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ముంబై ఆటగాళ్లలో డికాక్ 78, రోహిత్ శర్మ 35 పరుగులతో రాణించారు. దీంతో 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది.
    Published by:Sumanth Kanukula
    First published: