ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Eliminator, SRH vs RCB: టాస్ గెలిచిన వార్నర్.. మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం

IPL 2020 Eliminator, SRH vs RCB: కీలకమైన ఈ పోరులో SRH స్టార్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆడడం లేదు. గాయం కారణంగా అతడు మ్యాచ్‌కు దూరమయ్యాడు. సాహా స్థానంలో శ్రీవాత్స్ గోసామిని జట్టులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: November 6, 2020, 7:13 PM IST
IPL 2020 Eliminator, SRH vs RCB: టాస్ గెలిచిన వార్నర్.. మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం
విరాట్ కొహ్లీ, డేవిడ్ వార్నర్ (Image:IPL)
  • Share this:
IPL 2020 Eliminator, SRH vs RCB: ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్‌లో నేడు మరో కీలక పోరు జరగుతోంది. అబుదాబి వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. మరికొద్ది నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. షేక్ జాయెద్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన ఈ పోరులో SRH స్టార్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఆడడం లేదు. గాయం కారణంగా అతడు మ్యాచ్‌కు దూరమయ్యాడు. సాహా స్థానంలో శ్రీవాత్స్ గోసామిని జట్టులోకి తీసుకున్నారు. ఇక బెంగళూరు జట్టులో రెండు మార్పులు చేశారు. జంపా స్థానంలో ఫించ్, షాబాజ్ స్థానంలో సైని జట్టులోకి వచ్చారు.

జట్ల వివరాలు:

Royal Challengers Bangalore (Playing XI): అరోన్ ఫించ్, దేవదత్ పడిక్కల్, విరాట్ కొహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, నవదీప్ సైని, అడమ్ జంపా, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్.

Sunrisers Hyderabad (Playing XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), శ్రీవత్స్ గోసామి (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియంగార్గ్, జేసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి. నటరాజన్.


ఈ పోరులో గెలిస్తేనే క్వాలిఫైయర్-2కు వెళ్తారు. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటి బాటపడతారు. ఇంతటి కీలక మ్యాచ్‌లో గెలివాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడగా.. హైదరాబాద్ 8 సార్లు గెలిచింది. మరో 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు తలపడ్డాయి. చెరొక మ్యాచ్‌లో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. సెప్టెంబరు 21న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. అక్టోబరు 31న షార్జా వేదికగా మ్యాచ్‌లో ఆర్సీబీని 5 వికెట్ల తేడాతో ఓడించింది ఎస్‌ఆర్‌హెచ్.

కాగా, లీగ్ దశలో విడివిడిగా 14 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు.. చోరో ఏడింట గెలిచాయి. మరో ఏడింట ఓడిపోయాయి. 14 పాయింట్లు సాధించాయి. ఐతే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా పాయింట్లో పట్టికలో మూడో స్థానాన్ని సాధించింది హైదరాబాద్. కొహ్లీ సేన నాలుగో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్‌-కు వెళ్తుంది. నవంబరు 8న జరిగే ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది.
Published by: Shiva Kumar Addula
First published: November 6, 2020, 7:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading