ఐపీఎల్ 2020

  • associate partner

SRH vs RCB, IPL 2020 Eliminator: ఆర్సీబీని కట్టడిచేసిన బౌలర్లు.. బ్యాట్స్‌మెన్ ఏం చేస్తారో?

IPL 2020 Eliminator, SRH vs RCB: ఏబీ డివిలియర్స్ ఒంటరి పోరు చేసి టీమ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. లేదంటే బెంగళూరు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

news18-telugu
Updated: November 6, 2020, 9:16 PM IST
SRH vs RCB, IPL 2020 Eliminator: ఆర్సీబీని కట్టడిచేసిన బౌలర్లు.. బ్యాట్స్‌మెన్ ఏం చేస్తారో?
డివిలియర్స్ ఔట్ (Image:IPL)
  • Share this:
IPL 2020 Eliminator, SRH vs RCB: ఐపీఎల్ 2020 ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కీలక మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ను బోల్తాకొట్టించి.. తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి..131 పరుగులు చేసింది. SRH బౌలర్ల ధాటికి ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. కెప్టెన్ కొహ్లీ ఓపెనింగ్ రావడం ఏ మాత్రం కలిసి రాలేదు. ఏబీ డివిలియర్స్ 56, అరోన్ ఫించ్ 32 పరుగులతో రాణించారు. మిగతా అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. విరాట్ కొహ్లీ 6, పడిక్కల్ 1, మోయిన్ అలీ 0, శివం దూబె 8, వాషింగ్టన్ సుందర్ 5 రన్స్ మాత్రమే చేశారు. సైని 9, సిరాజ్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఏబీ డివిలియర్స్ ఒంటరి పోరు చేసి టీమ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. లేదంటే బెంగళూరు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

బెంగళూరు జట్టు ఇన్నింగ్స్‌లో ప్రారంభం నుంచీ ఇబ్బందులు పడింది. రెండో ఓవర్‌లో కొహ్లీ, నాలుగో ఓవర్లలో పడిక్కల్ ఔట్ కావడంతో స్కోర్ వేగం మందగించింది. అనంతరం ఫించ్, డివిలియర్స్ మూడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఐతే 11 ఓవర్ నుంచి మళ్లీ వరుసగా వికెట్లు పడ్డాయి. ఆ ఓవర్లో ఫించ్, మోయిన్ అలీ ఔట్ అయ్యారు. అనంతరం స్వల్ప వ్యవధిలోనే శివం దుబే, వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ బాట పట్టారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు ఒక్కడే ధాటిగా ఆడుతూ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు డివిలియర్స్. ఐతే 18వ ఓవర్లో నటరాజన్ మంచి బ్రేక్ త్రూ అందించాడు. డేంజరస్‌గా కనిపిస్తున్న డివిలియర్స్‌ను పవర్‌ఫుల్ యార్కర్‌తో క్లీన్ బౌల్ట్ చేశాడు. ఏబీడీ ఔట్ కావడంతో బెంగళూరు స్కోర్ మందగించింది. చివరకు 20 ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసింది.

హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. ఇక నటరాజన్ 2, షాబాజ్ నదీమ్ ఒక వికెట్ తీశారు.

ఈ పోరులో గెలిస్తేనే క్వాలిఫైయర్-2కు వెళ్తారు. లేదంటే టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటి బాటపడతారు. ఇంతటి కీలక మ్యాచ్‌లో గెలివాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు 15 సార్లు ముఖాముఖి తలపడగా.. హైదరాబాద్ 8 సార్లు గెలిచింది. మరో 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో ఇంతకు ముందు రెండు సార్లు తలపడ్డాయి. చెరొక మ్యాచ్‌లో గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. సెప్టెంబరు 21న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. అక్టోబరు 31న షార్జా వేదికగా మ్యాచ్‌లో ఆర్సీబీని 5 వికెట్ల తేడాతో ఓడించింది ఎస్‌ఆర్‌హెచ్.

కాగా, లీగ్ దశలో విడివిడిగా 14 మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లు.. చోరో ఏడింట గెలిచాయి. మరో ఏడింట ఓడిపోయాయి. 14 పాయింట్లు సాధించాయి. ఐతే నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న కారణంగా పాయింట్లో పట్టికలో మూడో స్థానాన్ని సాధించింది హైదరాబాద్. కొహ్లీ సేన నాలుగో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్‌-కు వెళ్తుంది. నవంబరు 8న జరిగే ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది.
Published by: Shiva Kumar Addula
First published: November 6, 2020, 9:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading