Home /News /ipl /

IPL 2020 DISNEY PLUS HOTSTAR VIP SUBSCRIPTION FOR FREE WITH THESE PREPAID RECHARGE PLANS FROM RELIANCE JIO AND AIRTEL SS

IPL 2020: ఐపీఎల్ మ్యాచ్ చూడాలా? ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

IPL 2020: ఐపీఎల్ మ్యాచ్ చూడాలా? ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

IPL 2020: ఐపీఎల్ మ్యాచ్ చూడాలా? ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ

Disney+ Hotstar VIP subscription free | డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందాలనుకుంటున్నారా? రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్స్‌పై ఈ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందొచ్చు.

    త్వరలో ఐపీఎల్ సందడి మొదలుకాబోతోంది. మళ్లీ క్రికెట్ హడావుడి కనిపించనుంది. మరి మీరు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలనుకుంటున్నారా? రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్ యూజర్లు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ ఉచితంగా అందించేందుకు రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా పోటాపోటీగా కొత్త ప్లాన్స్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్లాన్స్ రీఛార్జ్ చేసేవారికి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఫ్రీగా లభిస్తున్నాయి. మరి రూ.399 విలువగల డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందేందుకు ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేయాలో తెలుసుకోండి.

    Jio Rs 499 Plan: రిలయెన్స్ జియో కొత్తగా ప్రకటించిన ప్లాన్ ఇది. కేవలం డేటా టాప్ అప్ ప్లాన్ మాత్రమే. రూ.499 రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ 4జీ డేటా లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌కు ఇది వర్తిస్తుంది. ఈ ప్లాన్ వేలిడిటీ 56 రోజులు. రోజూ 1.5 జీబీ డేటా చొప్పున 84జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు. రూ.499 రీఛార్జ్ చేస్తే రూ.399 విలువైన ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

    Jio Rs 777 Plan: ఇది కూడా ఐపీఎల్ సందర్భంగా జియో ప్రకటించిన ప్లాన్. రూ.777 రీఛార్జ్ చేస్తే రోజూ 1.5జీబీ 4జీ డేటా 84 రోజుల పాటు లభిస్తుంది. అదనంగా మరో 5జీబీ డేటా కూడా పొందొచ్చు. అంటే మొత్తం 131జీబీ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 3000 నిమిషాల కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌కు కూడా రూ.399 విలువైన ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

    Job Loss: ఉద్యోగం పోయిందా? 15 రోజుల్లో సగం జీతం మీ అకౌంట్‌లో పొందండి ఇలా

    Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

    IPL 2020, IPL 2020 free hotstar vip, Jio plans with Disney+ Hotstar, Jio plans with Disney+ Hotstar, Airtel plans with Disney+ Hotstar, Reliance Jio prepaid plans, Airtel prepaid plans, ఐపీఎల్ 2020, ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్, జియో రీఛార్జ్ ప్లాన్స్
    ప్రతీకాత్మక చిత్రం


    Jio Rs 401 Plan: జియో గతంలో ప్రకటించిన ప్లాన్ ఇది. రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 3జీబీ చొప్పున 84జీబీ డేటాతో పాటు అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్‌కు 1000 నిమిషాలు మాట్లాడొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

    Jio Rs 2599 Plan: రిలయెన్స్ జియో రూ.2599 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ చొప్పున 730జీబీ డేటాతో పాటు అదనంగా 10జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 740 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్‌కు 12000 నిమిషాలు మాట్లాడొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

    Jio Rs 612 Plan: రిలయెన్స్ జియో రూ.612 యాడ్ ఆన్ ప్లాన్. అంటే ప్రస్తుతం ఏదైనా ప్లాన్‌లో ఉన్నవారు మాత్రమే ఈ ప్లాన్ రీఛార్జ్ చేయాలి. వారికి రూ.51 విలువైన 12 వోచర్లు వస్తాయి. 6జీబీ డేటా లభిస్తుంది. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్, జియో నుంచి ఇతర నెట్వర్క్స్‌కు 500 నిమిషాలు మాట్లాడొచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.1004, రూ.1206, రూ.1208 యాడ్ ఆన్ ప్లాన్‌లకు కూడా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.

    RBI New Rules: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? సెప్టెంబర్ 30 నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్

    Pension Scheme: ఈ పథకంలో 2.4 కోట్ల మంది చేరారు... నెలకు రూ.5,000 పెన్షన్‌ గ్యారెంటీ

    IPL 2020, IPL 2020 free hotstar vip, Jio plans with Disney+ Hotstar, Jio plans with Disney+ Hotstar, Airtel plans with Disney+ Hotstar, Reliance Jio prepaid plans, Airtel prepaid plans, ఐపీఎల్ 2020, ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్, జియో రీఛార్జ్ ప్లాన్స్
    ప్రతీకాత్మక చిత్రం


    Airtel Rs 448 Plan: ఎయిర్‌టెల్ రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 3జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా ఉచితంగా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. అన్ని నెట్వర్క్స్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

    Airtel Rs 599 Plan: ఎయిర్‌టెల్ రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 2జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా ఉచితంగా లభిస్తుంది. వేలిడిటీ 56 రోజులు. అన్ని నెట్వర్క్స్‌కు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

    Airtel Rs 2698 Plan: ఎయిర్‌టెల్ రూ.2698 ఇయర్లీ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌పై డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Disney+ Hotstar, Hotstar, IPL, IPL 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు