గత ఏడాది క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు సంబంధించిన ఒక కీలక విషయం బయటికొచ్చింది. సహజంగా ఐపిఎల్ అనగానే బెట్టింగ్ ఆరోపణలు జోరందుకుంటాయి. బెట్టింగ్ ఆరోపణలతో కొంతమంది ఆటగాళ్లు అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వార్తే ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఒక భారతీయ ఆటగాడిని ట్రాప్ చేసి మ్యాచ్కు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని రాబట్టి బెట్టింగ్ (Betting) నిర్వహించాలని చూసింది న్యూఢిల్లీ(New Delhi)కి చెందిన ఒక మహిళ. నర్సు(Nurse)గా పనిచేస్తున్న సదరు మహిళ తాను పెద్ద డాక్టర్(doctor) అని చెప్పుకుంటూ ఐపీఎల్ ఆటగాడిని సెప్టెంబర్ 30న సోషల్ మీడియాలో అప్రోచ్ అయ్యింది.- సదరు ప్లేయర్ను మ్యాచ్ గురించి అంతర్గత సమాచారం చెప్పాలని కోరింది. అంతేకాక, ఆ మ్యాచ్లో ఆడబోయే 11 మంది ప్లేయర్స్ గురించి సమాచారం ఇవ్వాలని కోరింది. అతడు అందించే కీలక సమాచారంతో బెట్టింగ్ నిర్వహించాలని చూసింది.
కాగా, అప్రమత్తమైన సదరు ఆటగాడు.. మ్యాచ్కు సంబంధించిన అందర్గత సమాచారం బయటకు చెప్పడం నేరమని, ఇలాంటి సమాచారం అడగవద్దని కోరాడు. అంతేకాక, దీని గురించి పోలీసులకు తెలియజేస్తానని కూడా హెచ్చరించాడు. ఆ తర్వాత సదరు మహిళ వ్యవహారంపై బీసీసీఐ దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో రంగంలోకి బిసిసిఐ అవినీతి నిరోధక విభాగం (ACU) చీఫ్ అజిత్ సింగ్(Ajit Singh) అధ్యక్షతన దర్యాప్తు చేపట్టారు. విచారణలో సదరు ఆటగాడు మ్యాచ్కు సంబంధించిన అంతర్గత సమాచారాన్ని లీక్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తును మూసివేశారు. కాగా దీనిపై బీసీసీఐ(BCCI) స్పందిస్తూ " ఐపిఎల్(IPL) జరుగుతున్న సమయంలోనే సదరు ఆటగాడు మాకు దీనిపై సమాచారం ఇచ్చాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మేము దర్యాప్తు ప్రారంభించాం. అయితే, అంతర్గత సమాచారాన్ని కోరిన సదరు మహిళకు ఏ బెట్టింగ్ సిండికేట్‌తోనూ సంబంధాలు లేదని నిర్థారించుకున్నాం. అందువల్ల, కేసు దర్యాప్తు(Investigation)ను మూసివేశాం.’’ అని అన్నారు.
డాక్టర్‌గా సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని..
కాగా, మూడేళ్ల క్రితం సదరు క్రికెటర్కు నర్సు తన అభిమాని అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో పరిచయం చేసుకుంది. అంతేకాక, నర్సుగా పనిచేస్తున్న సదరు మహిళ న్యూఢిల్లీలోని ప్రైవేటు హాస్పిటల్లో డాక్టర్ అని చెప్పుకుంది. అయితే, ఆ క్రికెటర్ ఇటీవల ఆమెతో సన్నిహితంగా ఉన్నాడని దర్యాప్తు(Investigation)లో తేలింది. అయితే, అతను సదరు మహిళను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని, సోషల్ మీడియా(Social Media)లో మాత్రమే ఆమెతో సంభాషించినట్లు దర్యాప్తు నివేదిక స్పష్టం చేసింది. ఇదే రకమైన బెట్టింగ్ విధానం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సుమారు నెల తరువాత అటువంటి ఘటనే మరోసారి జరగడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.