news18-telugu
Updated: November 1, 2020, 4:27 PM IST
ఎంఎస్ ధోనీ (Image:IPL)
IPL 2020: ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ హాట్ ఫేవరెట్‌గా ఉంటుంది. టైటిల్ రేసులో ముందుంటుంది. చెన్నై జట్టు మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచింది. 8 సార్లు ఫైనల్‌కు వెళ్లింది. 10 సార్లు ప్లే ఆఫ్స్ ఆడింది. ఇంతడి ఘనమైన రికార్డు ఉన్న ధోనీ సేన.. 2020 టోర్నీలో మాత్రం అట్టర్ ఫ్లాపయింది. ప్రారంభ మ్యాచ్‌లో ముంబైని ఓడించి శుభారంభం చేసినప్పటికీ.. ఆ దూకుడు కొనసాగించలేపోయింది. ఎప్పుడూ లేనంత చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి వెళ్లిపోయింది. ధోనీతో పాటు ఇతర ఆటగాళ్ల ప్రదర్శనపై నెటిజన్లతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ధోనీలో పస తగ్గిందని.. ఇక ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటే మంచిదని సలహాలు ఇస్తున్నారు. ధోనీ కూడా ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ కావాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్పై ధోనీ కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్లో ఇదే తన చివరి మ్యాచ్ కాదని చెప్పిన ధోనీ.. వచ్చే ఐపీఎల్ కూడా ఆడతానని క్లారిటీ ఇచ్చారు. అబుదాబిలో ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడుతోంది చెన్నై జట్టు. టాస్ వేసే సమయంలో రిటైర్మెంట్ గురించి కాంమెంటేటర్ డానీ మోరిసన్.. ధోనీని ప్రశ్నించారు. యెల్లో జెర్సీలో ఇదే చివరి మ్యాచా? అని అడగడంతో..' ఖచ్చితంగా కాదు'. అని సమాధానం ఇచ్చారు. అంటే వచ్చే ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడతానని చెప్పకనే చెప్పారు ధోనీ. ఈ ప్రకటనలతో తన రిటైర్మెంట్ గురించి వస్తున్న పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు.
కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం 5 మ్యాచ్‌లు గెలిచి... మరో 8 ఓడిపోయింది. 10 పాయింట్లతో అట్టడుగున నిలిచింది. చెత్త ప్రదర్శన కారణంగా ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది ధోనీ సేన. ఈ సీజన్లో చివరి మ్యాచ్‌ను కింగ్స్ ఎలెవన్ జట్టుపై ఆడుతోంది. టోర్నీలో 13 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 200 పరుగులు మాత్రమే చేశాడు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 1, 2020, 4:21 PM IST