HOME »NEWS » »ipl 2020 dc vs rr live cricket score delhi capitals vs rajasthan royals dc won toss choose to bat sk

DC vs RR, IPL 2020 Live Score: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. జట్లలో మార్పులు ఇవే

DC vs RR, IPL 2020 Live Score: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. జట్లలో మార్పులు ఇవే
DC vs RR, IPL 2020 Live Score: టోర్నీలో ఇంతకు ముందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

DC vs RR, IPL 2020 Live Score: టోర్నీలో ఇంతకు ముందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

  • Share this:
    ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ 30వ మ్యాచ్ జరుగుతోంది. దుబయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ జట్టు సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతోంది. ఎలాంటి మార్పులు చేయలేదు. ఢిల్లీలో మాత్రం ఒక మార్పుతో ఈ మ్యాచ్ ఆడుతోది. రిషంబ్ పంత్ స్థానంలో తుషార్ దేశ్ పాండేను జట్టులోకి తీసుకున్నారు. తుషార్‌కు ఐపీఎల్‌లో అరంగ్రేట మ్యాచ్ ఇదే కావడం విశేషం. టోర్నీలో ఇంతకు ముందు ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

    జట్ల వివరాలు:


    Rajasthan Royals (Playing XI): స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, సంజు శామ్సన్, రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కట్, కార్తీక్ త్యాగి.


    Delhi Capitals (Playing XI): శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, పృథ్వీ షా, శిఖర్ ధావన్, ఆజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, తుషార్ దేశ్ పాండే, కగిసో రబడా, అన్రిచ్ నార్జే

    ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ, రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు తలపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 11 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందాయి. కాగా, పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన డీసీ టీమ్..కేవలం రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. మిగిలిన 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక రాజస్థాన్ విషయానికొస్తే.. టోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం మూడింటిలో మాత్రమే గెలుపొందింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలయింది.
    Published by:Shiva Kumar Addula
    First published:October 14, 2020, 19:06 IST