హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

DC vs RCB: ఓడితే అంతే సంగతి... కోహ్లీసేనకు మాత్రం మరో ఛాన్స్

DC vs RCB: ఓడితే అంతే సంగతి... కోహ్లీసేనకు మాత్రం మరో ఛాన్స్

ఐపీఎల్ 2020 రణరంగాన్ని తలపిస్తోంది. టోర్నీ చరిత్రలో ఎప్పుడు లేనంతగా జట్ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. సోమవారం అబుదాబి వేదికగా  మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది.

ఐపీఎల్ 2020 రణరంగాన్ని తలపిస్తోంది. టోర్నీ చరిత్రలో ఎప్పుడు లేనంతగా జట్ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. సోమవారం అబుదాబి వేదికగా  మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది.

ఐపీఎల్ 2020 రణరంగాన్ని తలపిస్తోంది. టోర్నీ చరిత్రలో ఎప్పుడు లేనంతగా జట్ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. సోమవారం అబుదాబి వేదికగా  మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది.

ఐపీఎల్ 2020 రణరంగాన్ని తలపిస్తోంది. టోర్నీ చరిత్రలో ఎప్పుడు లేనంతగా జట్ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. సోమవారం అబుదాబి వేదికగా  మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానం కోసం ఢిల్లీ క్యానిటల్స్,రాయల్ ‌ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య తీవ్రమైన నేడు బిగ్ ఫైట్ జరగనుంది. గెలిచి జట్టు రెండో స్ధానానికి చేరుకుంటే ఇక ఓడినా జట్టు ప్లే ఆఫ్స్‌‌ చేరడం కష్టమవుతుంది. కావునా ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్లు అస్త్ర శస్త్రాలను సిద్దంచేసుకుంటున్నాయి.

వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఆ జట్టుకు బౌలింగ్ విభాగం సమస్యగా మారింది. ఆరంభంలో ఆదరగొట్టిన ఈ జట్టు చివర్లో మాత్రం చతికిలపడింది. బ్యాటింగ్‌లో పృథ్వీ షా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్‌‌ తడబడుతున్నారు.

వరుసగా రెండు సెంచరీలు చేసి ఊపు మీద కనిపించిన దావన్ చివరి మూడు మ్యా్చ్‌ల్లో 0, 0, 6 రన్స్‌‌తో దారుణంగా విఫలయ్యాడు. అతనితో పాటు మరో ఓపెనర్ పృథ్వీ షా,మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్ కూడా రాణించడం లేదు. బ్యాటింగ్ లోపాలను సరిచేసుకుంటే ఆర్సీబీకి కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే... టోర్నీ ఫస్ట్‌‌ హాఫ్‌‌లో వరుస విజయాలు సాధించిన ఢిల్లీ.. చివర్లో చతికిలపడింది. బ్యాటింగ్‌‌లో ఫర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్‌‌లో చేతులెత్తేయడం ఆందోళన కలిగిస్తున్నది. ఓపెనింగ్‌‌లో నిలకడగా ఆడే ప్లేయర్లు లేకపోవడం కూడా ప్రతికూలాంశం. పృథ్వీ షా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్‌‌ కాంబినేషన్‌‌ కగిసో రబడా, నోర్జ్, అశ్విన్, అక్షర్ పటేల్ ప్రత్యర్థి బాట్స్‌మెన్స్‌కు దాసోహం అవుతున్నారు. పరుగులు నియంత్రించడంలో విఫలం చెందుతున్నారు.

ఇక రాయల్ ఛాలెంజర్ బెంగళూర్ విషయానికి వస్తే... ఈ ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఆర్‌‌సీబీ కూడా చివరిగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయం చెంది ఓత్తిడిలోనే కనిపిస్తోంది. బ్యాటింగ్ విషయానికి వస్తే మెుదటిలో రాణించిన డివిలియర్స్‌‌ విఫలం చెందుతున్నాడు. కెప్టెన్ కోహ్లీ కూడా వైఫల్యం చెందుతుండడం.. ఓపెనర్స్ పడిక్కల్,జోష్‌‌ ఫిలిప్ కూడా నిలకడగా రాణించకపోవడంతో బ్యాటింగ్ బలహీనత కనిపిస్తోంది. బౌలింగ్‌లో

చాహల్ పర్వాలేదనిపిస్తున్న క్రిస్ మోర్రిస్, సిరాజ్, ఉడానా మెరుగుపడాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ రెండు జట్లు 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. గెలిచిన జట్టు రెండో స్ధానానికి చేరుతుంది. ఓడిన జట్టు టీం భవితవ్యం హైదరాబాద్- ముంబై మ్యాచ్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే టాప్-3లో నిలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు కోల్‌కతా రన్ రేటుతో పోటిపడాల్సి ఉంటుంది. ఆర్సీబీ ప్రస్తుతం రెండో స్ధానంలో ఉంది, రన్ రేటు కూడా మైనస్ ఉన్నప్పటికి కేకేఆర్ అది తక్కువే.. అయితే ఆ జట్టు  ఓడితే మాత్రం మనో ఛాన్స్ ఉంటుంది.

First published:

Tags: Delhi Capitals, IPL 2020, Kings XI Punjab

ఉత్తమ కథలు