Home /News /ipl /

IPL 2020 DC VS MI LIVE CRICKET SCORE DELHI CAPITALS VS MUMBAI INDIANS POLLARD WON TOSS OPT TO BOWL SK

DC vs MI, IPL 2020: దుబాయ్‌లో బ్లూ వర్సెస్ బ్లూ.. టాస్ గెలిచిన ముంబై

శ్రేయాస్ అయ్యర్, కీరన్ పొలార్డ్ (Image:IPL)

శ్రేయాస్ అయ్యర్, కీరన్ పొలార్డ్ (Image:IPL)

DC vs MI, IPL 2020: ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, ప్యాటిన్సన్‌కు రెస్ట్ ఇచ్చారు. వారి స్థానాల్లో జయంత్ యాదవ్, కౌల్టర్‌నైల్ జట్టులోకి వచ్చారు.

    IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో 51వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, ప్యాటిన్సన్‌కు రెస్ట్ ఇచ్చారు. వారి స్థానాల్లో జయంత్ యాదవ్, కౌల్టర్‌నైల్ జట్టులోకి వచ్చారు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మార్పులు చేసింది. ప్రవీణ్ దుబే ఐపీఎల్‌లోకి అరంగ్రేటం చేశాడు. పృథ్వీ షా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. రహానే, అక్షర్ పటేల్, తుషార్ దేశ్‌పాండేని పక్కనబెట్టారు.

    జట్ల వివరాలు:
    Delhi Capitals (Playing XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్‌మెయిర్, మార్కస్ స్టోయినిస్, హర్షల్ పటేల్, ప్రవీణ్ దుబే, కాగిసో రబాడ, రవిచంద్రన్ అశ్విన్, అన్రిచ్ నార్జీ.

    Mumbai Indians (Playing XI): క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జయంత్ యాదవ్, నాథన్ కౌల్టర్ నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.


    ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 25 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై జట్టు 13 సార్లు గెలవగా... ఢిల్లీ టీమ్ 12 సార్లు విజయం సాధించింది. ఐపీఎల్ 2020 టోర్నీలో ఇంతకు ముందు కూడా ఇరుజట్లు మ్యాచ్ ఆడాయి.  అక్టోబరు 11న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబైపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు.. పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానం పొందాలని ఢిల్లీ భావిస్తోంది. ఢిల్లీని మరోసారి ఓడించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగించాలని ముంబై కూడా పట్టుదలతో ఉంది.
    ORANGE CAP:
    PURPLE CAP:

    కాగా, ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 12 మ్యాచ్‌లు ఆడాయి. ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్‌లు గెలిచి.. నాలుగింట ఓడిపోయింది. 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 మ్యాచ్‌లు గెలిచి.. ఐదు ఓడిపోయింది. 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Delhi Capitals, IPL, IPL 2020, Mumbai Indians

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు