IPL 2020 DC VS MI LIVE CRICKET SCORE DELHI CAPITALS VS MUMBAI INDIANS POLLARD TEAM WON BY 9 WICKETS SK
DC vs MI, IPL 2020: దుబాయ్‌లో ఇషాన్ మెరుపులు.. ముంబై ఈజీ విక్టరీ
ఇషాన్ కిషన్ (Image:IPL)
DC vs MI, IPL 2020: ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. డికాక్ 26, సూర్యకుమార్ 12 పరుగులు చేశారు.
DC vs MI, IPL 2020: దుబాయ్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇటు బౌలింగ్.. అటు బౌలింగ్‌లో రాణించి.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై సునాయస విజయం సాధించింది. ఈ గెలుపుతో మరో రెండు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. 111 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ముంబై బ్యాట్స్‌మెన్ ఆడుతూ పాడుతూ చేధించారు. కేవలం ఒక వికెట్ కోల్పోయి.. 14.2 ఓవర్లలోనే.. జట్టుకు విజయాన్ని అందించారు. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. డికాక్ 26, సూర్యకుమార్ 12 పరుగులు చేశారు. ముంబై టీమ్‌కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, డికాక్ శుభారంభం ఇచ్చారు. 68 ఓవర్లో డికాక్ ఔటైన తర్వాత.. క్రీజులోకి వచ్చిన సూర్యతో కలిసి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు ఇషాన్ కిషన్. సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అన్రిచ్ నార్జీ ఒక వికెట్ తీశాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది. ముంబై పేసర్స్ బుమ్రా, బౌల్ట్ దెబ్బకు ముంబై బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25, రిషబ్ పంత్ 21 పరుగులతో పరవా లేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి నుంచే తడబడింది. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్ ఔటయ్యాడు. మూడో ఓవర్లో పృథ్వీ షా పెవిలియన్ వెళ్లాడు. ఆ తర్వాత శ్రేయాస్, పంత్ కాసేపు క్రీజులో నిలబడ్డారు. 11 ఓవర్లో శ్రేయస్ అయ్యర్ ఔట్ అయిన తర్వాత.. ఢిల్లీ పతనం మొదలయింది. వరుసగా వికెట్లు పడడంతో స్కోర్ వేగం మందగించింది. చివరకు 110 పరుగులు మాత్రమే చేసింది.
ముంబై బౌలర్లలో జాస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. బుమ్రా 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బౌల్ట్ 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కౌల్టర్‌నైల్, రాహుల్ చాహర్ చెరో వికెట్ సాధించారు.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 26 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై జట్టు 14 సార్లు గెలవగా... ఢిల్లీ టీమ్ 12 సార్లు విజయం సాధించింది. ఐపీఎల్ 2020 టోర్నీలో ఇంతకు ముందు కూడా ఇరుజట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 11న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీని ఓడించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది ముంబై ఇండియన్స్.
ORANGE CAP:
PURPLE CAP:
కాగా, ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 13 మ్యాచ్‌లు ఆడాయి. ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌లు గెలిచి.. నాలుగింట ఓడిపోయింది. 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 మ్యాచ్‌లు గెలిచి.. 6 ఓడిపోయింది. 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.