Home /News /ipl /

IPL 2020 DC VS MI LIVE CRICKET SCORE DELHI CAPITALS VS MUMBAI INDIANS DC SCORES 110 RUNS SK

DC vs MI, IPL 2020: బుమ్రా, బోల్ట్ దెబ్బకు ఢిల్లీ ఢమాల్.. ముంబైకి స్వల్ప లక్ష్యం

బుమ్రాను అభినందిస్తున్న కెప్టెన్ పొలార్డ్ (Image:IPL)

బుమ్రాను అభినందిస్తున్న కెప్టెన్ పొలార్డ్ (Image:IPL)

DC vs MI, IPL 2020: ముంబై బౌలర్లలో జాస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. బుమ్రా 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బౌల్ట్ 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కౌల్టర్‌నైల్, రాహుల్ చాహర్ చెరో వికెట్ సాధించారు.

ఇంకా చదవండి ...
    IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో 51వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది. ముంబై పేసర్స్ బుమ్రా, బౌల్ట్ దెబ్బకు ముంబై బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25, రిషబ్ పంత్ 21 పరుగులతో పరవా లేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి నుంచే తడబడింది. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్ ఔటయ్యాడు. మూడో ఓవర్లో పృథ్వీ షా పెవిలియన్ వెళ్లాడు. ఆ తర్వాత శ్రేయాస్, పంత్ కాసేపు క్రీజులో నిలబడ్డారు. 11 ఓవర్లో శ్రేయస్ అయ్యర్ ఔట్ అయిన తర్వాత.. ఢిల్లీ పతనం మొదలయింది. వరుసగా వికెట్లు పడడంతో స్కోర్ వేగం మందగించింది. చివరకు 110 పరుగులు మాత్రమే చేసింది.

    ముంబై బౌలర్లలో జాస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. బుమ్రా 4 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బౌల్ట్ 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కౌల్టర్‌నైల్, రాహుల్ చాహర్ చెరో వికెట్ సాధించారు.


    ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు 25 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. ముంబై జట్టు 13 సార్లు గెలవగా... ఢిల్లీ టీమ్ 12 సార్లు విజయం సాధించింది. ఐపీఎల్ 2020 టోర్నీలో ఇంతకు ముందు కూడా ఇరుజట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 11న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబైపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు.. పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానం పొందాలని ఢిల్లీ భావిస్తోంది. ఢిల్లీని మరోసారి ఓడించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగించాలని ముంబై కూడా పట్టుదలతో ఉంది.

    ORANGE CAP:
    PURPLE CAP:

    కాగా, ఈ టోర్నీలో ఇరు జట్లు చెరో 12 మ్యాచ్‌లు ఆడాయి. ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్‌లు గెలిచి.. నాలుగింట ఓడిపోయింది. 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 మ్యాచ్‌లు గెలిచి.. ఐదు ఓడిపోయింది. 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Delhi Capitals, IPL, IPL 2020, Mumbai Indians

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు