ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Live Score, DC vs KXIP: సూపర్ ఓవర్లో ఢిల్లీ ఘన విజయం

Dream11 IPL 2020 Live Update: సూపర్ ఓవర్లో కేవలం 3 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది.

news18-telugu
Updated: September 20, 2020, 11:51 PM IST
IPL 2020 Live Score, DC vs KXIP: సూపర్ ఓవర్లో ఢిల్లీ ఘన విజయం
ఢిల్లీ క్యాపిటల్స్ విజయం (Image;IPL/Twitter)
  • Share this:
ఐపీఎల్‌ అంటే ఎలాంటి కిక్ అభిమానులు ఆశిస్తారో, అలాంటి కిక్ ఇచ్చే మ్యాచ్ రెండోదే వచ్చింది. దుబాయ్ కేంద్రంగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్‌కు దారి తీసింది. వాస్తవానికి రెండో ఇన్నింగ్స్  19.4 ఓవర్లకు స్కోర్ సమం అయింది. రెండు బంతుల్లో ఒక రన్ కొట్టాల్సి ఉండగా, మయాంక్ అగర్వాల్ ఔట్ అయ్యాడు. ఫోర్ కొట్టబోయి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒక బాల్‌లో ఒక రన్ కావాల్సి ఉండగా, జోర్డాన్ కొట్టిన బంతిని రబాడా క్యాచ్ పట్టాడు. దీంతో రెండు జట్ల స్కోర్ సమం అయింది. సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

సూపర్ ఓవర్లో ఢిల్లీ బౌలర్ రబాడా బౌలింగ్  చేశాడు. మూడు బంతుల్లోనే కేఎల్ రాహుల్, మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేశాడు. సూపర్ ఓవర్లో రెండు వికెట్లు పడడంతో సూపర్ ఓవర్ ఫినిష్ అయిపోయింది.

ఇక కింగ్స్ లెవన్ పంజాబ్‌ తరఫున షమీ బౌలింగ్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ బరిలోకి దిగారు. మొదటి బాల్ డాట్ బాల్. రెండో బంతి వైడ్. మూడో బంతికి రెండు రన్స్ వచ్చాయి. దీనితో ఢిల్లీ విజయ సాధిచింది.

మొత్తానికి ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ బోణీ కొట్టింది. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే విజయం సాధించింది.   సారధ్యంలోని జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో  జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ టీమ్ మొదట్లో బాగానే ఆడింది. కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాక మెల్లగా వికెట్లు పడ్డాయి. మధ్యలో స్కోర్ నెమ్మదించింది. మొదటి నుంచి క్రీజ్‌లో నిలిచిన మయాంక్ అగర్వాల్ మెల్ల మెల్లగా కుదురుకున్నాడు. చివర్లో దుమ్ము దులిపాడు. తన మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 59 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అయితే స్కోర్ 157 వద్ద ఔటయ్యాడు. చివరి బంతికి ఒక్క రన్ కొడితే గెలిచే వేళ ఔట్ అయ్యాడు. లాంగ్ షాట్ ఫోర్ కొట్టాడు. కానీ, అది క్యాచ్ అయింది.

అంతకు ముందు ఢిల్లీ ప్లేయర్ స్టొయినిస్ చివరి ఓవర్లలో చెలరేగి ఆడాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు సాధించింది. మొదట్లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నాడు. 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఆర్ఆర్ పంత్ కూడా అయ్యర్‌తో జతకలిసి స్కోర్ బోర్డును నెమ్మదించకుండా చూశారు. పంత్ 31 రన్స్ చేశాడు. ఆ తర్వాత స్టోయినిస్ ఒంటరి పోరాటం చేశాడు. మధ్య మధ్యలో చిన్న చిన్న స్కోర్లకే బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టారు. అయితే, చివర్లో మెరుపులు మెరిపించాడు స్టొయినిస్. 20 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించారు. 53 పరుగులు చేసి చివరికి రనౌట్ అయ్యాడు.

సూపర్ ఓవర్ 

కింగ్స్ లెవన్ పంజాబ్ స్కోర్ : 2, W, W ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్:  0, WD, 2
Published by: Ashok Kumar Bonepalli
First published: September 20, 2020, 11:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading