ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Live Score, DC vs KXIP: చివర్లో చితక్కొట్టిన స్టోయినిస్, ఢిల్లీ స్కోర్ 157/8

Dream11 IPL 2020 Live Update: ఢిల్లీ ప్లేయర్ స్టొయినిస్ చెలరేగి ఆడాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు సాధించింది.

news18-telugu
Updated: September 20, 2020, 9:32 PM IST
IPL 2020 Live Score, DC vs KXIP: చివర్లో చితక్కొట్టిన స్టోయినిస్, ఢిల్లీ స్కోర్ 157/8
శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (File)
  • Share this:
దుబాయ్ కేంద్రంగా జరుగుతున్న ఐపీఎల్ 2020 రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గౌరవ ప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఢిల్లీ ప్లేయర్ స్టొయినిస్ చెలరేగి ఆడాడు. దీంతో  20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు సాధించింది. మొదట్లోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆదుకున్నాడు. 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఆర్ఆర్ పంత్ కూడా అయ్యర్‌తో జతకలిసి స్కోర్ బోర్డును నెమ్మదించకుండా చూశారు. పంత్ 31 రన్స్ చేశాడు. ఆ తర్వాత స్టోనిస్ ఒంటరి పోరాటం చేశాడు. మధ్య మధ్యలో చిన్న చిన్న స్కోర్లకే బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టారు. అయితే, చివర్లో మెరుపులు మెరిపించారు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు స్టొయినిస్. 53 పరుగులు చేశాడు. చివరి బంతికి రన్ ఔట్ అయ్యాడు.  అంతకు ముందు ఆట ఆరంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్లను త్వరగా పొగొట్టుకుంది. శిఖర్ ధావన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత పృధ్వీ షా, హెట్‌మెయిర్ ఇద్దరూ కూడా స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. మంచి బౌలింగ్‌తో ఈ ఇద్దర్నీ ఔట్ చేశాడు షమీ. కింగ్స్ లెవన్ బౌలర్లలలో షమీ 3, కాట్రెల్ 2 వికెట్లు పడగొట్టారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 20, 2020, 9:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading