150 స్పీడ్‌తో బాల్ వస్తుంటే ఏం చేయాలి.. అందుకే ఔటయ్యా!: వార్నర్

srhwarner

గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యా్చ్ గెలవడంపై ఆ జట్టు సారథి డేవిడ్ వార్నర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. త

 • Share this:
  గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యా్చ్ గెలవడంపై ఆ జట్టు సారథి డేవిడ్ వార్నర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. తమకు మిడిల్‌ ఆర్డర్‌ బలముందని ఈ మ్యాచ్ ద్వారా నిరూపితంమైందన్నారు. మ్యా్చ్ అనంతరం మాట్లాడిన వార్నర్‌ " మా ఆరంభం పాజిటివ్‌గానే సాగింది. పవర్‌ప్లే తర్వాత ఆట మా ఆధీనంలోకి వచ్చి్ంది. మిడల్ లార్డర్‌లో విజయ్‌ శంకర్‌, మనీష్‌ పాండే రాణించడం సంతోషాల్సిన విషయం. వారు కష్టానికి ఫలితం దక్కింది. నిజంగా ప్రపంచ శ్రేణి బౌలర్లను ఎదుర్కొంటు ఆడడం చాలా కష్టం. ఒక్కొ బాల్ 150 కిమీ వేగంతో వస్తుంటే ఏం చేయలేం. వీలైతే వాటిని అపాలి లేదా ఎదురుదాడికి దిగాలి. కానీ నేను మాత్రం ఔటయ్యానని"తెలిపారు.

  అలాగే ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలిసారిగా ఆడుతున్న జేసన్‌ హోల్డర్‌‌పై స్పందించిన వార్నర్ " హైదరాబాద్ జట్టుకు జేసన్‌ హోల్డర్‌ అదనపు బలం. అతను అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. అతని రాకతో మేం స్ట్రాంగ్ అయ్యాం. నిజానికి మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌కు సంపూర్ణ అవకాశాలు రాలేదు. ఈ మ్యాచ్‌తో మిడిల్‌ ఆర్డర్‌ బలం ఉందనే అభిమానులకు తెలిసింది' అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.  బౌలర్లను ఎదుర్కోడానికి మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి

  ఈ మ్యాచ్‌లో గెలవడంలో మనీష్ పాండేది కీలక పాత్ర. 47 బంతుల్లో 83 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఇక్కడ సర్‌ప్రైజ్ కావాల్సిన విషయం ఏమిటంటే ఆరేళ్ల తరువాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పాండే అందుకోవడం. ఆ అవార్డు ప్రజేంటేషన్‌లో మాట్లాడిన" సన్‌రైజర్స్ మిడిల్‌ ఆర్డర్‌ విఫలమవుతుండంపై చాలా విమర్శలు వచ్చాయి. ఇదే నాలో కసి పెంచింది. వికెట్ పడకుండా ఎలా షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నాను. వాటిలో సక్సెస్ అయ్యాం. బౌలర్లను ఎదుర్కోడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాం. ఈ గెలుపు స్పూర్తితో మిగితా మ్యాచ్‌ల్లోనూ రాణించాలని" ఉందన్నాడు.
  Published by:Rekulapally Saichand
  First published: