ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఆ మ్యాచ్‌లో ధోని చేసిన పనిపై డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే..

సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని.. అంపైర్ పాల్ రైఫెల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Updated: October 18, 2020, 8:14 AM IST
IPL 2020: ఆ మ్యాచ్‌లో ధోని చేసిన పనిపై డేవిడ్ వార్నర్ ఏమన్నాడంటే..
ఎంఎస్ ధోని
  • Share this:
ఐపీఎల్ 2020లో భాగంగా అక్టోబర్ 13న సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని.. అంపైర్ పాల్ రైఫెల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ధోని సంకేతాలతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. శార్దుూల్ ఠాకూర్ వేసిన బంతిని వైడ్‌గా ఇవ్వలేదు. ఇక, ఈ పరిణామంపై ఆ మ్యాచ్‌లో భాగమైన సన్‌రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ మౌనం వీడారు. ధోని తన హక్కుల్లో భాగంగానే అలా చేశాడని.. కానీ అంపైర్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకుని ఉండాల్సి కాదని అన్నాడు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వార్నర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

"ఆ రోజు బంతిని వైడ్‌గా ఇచ్చి ఉంటే ధోని నిరాశకు గరయ్యేవాడని నాకు తెలుసు. కానీ వాస్తవానికి ఆ బంతి వైడ్‌గా వెళ్లింది. అంపైర్ కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించేవాడు. కానీ ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ను చూసి అంపైర్ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కేవలం ధోని కావడం వల్లే ఇలా జరిగిందని నేను అనుకోను. కెప్టెన్ వికెట్ కీపర్‌గా ఉండటం వలన.. అంపైర్‌కు ఎదరుగా ఉండటంతో ఇలా జరిగి ఉండొచ్చు. ఆ సమయంలో ధోని తన అసహనాన్ని చూపించాడు. కెప్టెన్స్ మేము కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి భావోద్వేగాలనే ప్రదర్శిస్తాం. కావున దీనిపై పెద్దగా చర్చించడంలో అర్థం లేదు" అని వార్నర్ పేర్కొన్నారు.

ఇక, ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలింగ్ సందర్బంగా శార్దూల్ ఠాకూర్ వేసిన బంతిని అంపైర్ పాల్ రైఫిల్ వైడ్ ఇవ్వబోయాడు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో స‌న్‌రైజ‌ర్స్ 11 బంతుల్లో 24 ర‌న్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ బంతిని అంపైర్ వైడ్ ఇద్దామనే చేతులు చాస్తుండగా.. కీపర్ ధోని బంతి వైడ్ కాదన్న సంకేతాన్ని జారీ చేశాడు. దీంతో అంపైర్ తన చేతులు లేపుతున్న అంపైర్ వెంటనే వాటిని కిందకు దించాడు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది.
Published by: Sumanth Kanukula
First published: October 18, 2020, 8:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading