ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఇంకా ఛాన్స్ ఉంది.. ఇలా జరిగితే ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL 2020: కోల్‌కతా రాబోయే మూడు మ్యాచ్‌లు ఓడిపోతే.. ఆ టీమ్ 12 పాయింట్లకే పరిమితమవుతుంది. పంజాబ్ కూడా తదుపరి మూడు మ్యాచ్‌లు ఓడిపోతే ఆ జట్టు 10 పాయింట్ల వద్దే ఉంటుంది. అదే హైదరాబాద్ రాబోయే మూడు మ్యాచ్‌లు గెలిస్తే... మొత్తంగా 14 పాయింట్లు సాధిస్తుంది.

news18-telugu
Updated: October 25, 2020, 4:31 PM IST
IPL 2020: ఇంకా ఛాన్స్ ఉంది.. ఇలా జరిగితే ప్లే ఆఫ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్
డేవిడ్ వార్నర్
  • Share this:
IPL 2020: శనివారం పంజాబ్‌ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. లో స్కోర్‌ మ్యాచ్‌లోనూ టార్గెట్‌ను చేరుకోలేక చేతులెత్తేసింది వార్నర్ సేన. 127 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేక పరాజయం పాలయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో హైదరాబాద్ టీమ్ ప్లేఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. జట్టు ప్రదర్శనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ స్కోర్ కూడా చేధించడం చేత కాదా? అని సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. చేజేతులా ఓడిపోయి.. ప్లేఆఫ్స్‌కు దూరమయ్యారని విరుచుకుపడుతున్నారు. మరీ ఇంత చెత్త ప్రదర్శనా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

ప్రస్తుతానికి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు దూరమైంది. కానీ ఇంకా ఓ ఛాన్స్ ఉంది. అదెలాగంటే.. సన్ రైజర్స్ టీమ్ ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడింది. నాలుగింటిలో గెలించి.. ఏడింటిలో ఓడిపోయింది. 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు ఆడాలి. SRHతో పాటు కోల్‌కతా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో తదుపరి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇక ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడాలి. ఐతే తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌లను హైదరాబాద్ ఖచ్చితంగా గెలవాలి. అంటే ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లను ఓడించాలి.

ఐతే ఈ మూడు మ్యాచ్‌లను గెలిచినంత మాత్రాన హైదరాబాద్ ఖచ్చితంగా ప్లేఆఫ్స్‌కు వెళ్తుందన్న గ్యారంటీ లేదు. మిగతా జట్ల ప్రదర్శనపై ఇది ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ వెళ్లడం దాదాపు ఖాయమైంది. నాలుగో స్థానానికి.. కోల్‌కతా, పంజాబ్, హైదరాబాద్ పోటీపడుతున్నాయి. కోల్‌కతాకు 12, పంజాబ్‌కు 10, హైదరాబాద్‌కు 8 పాయింట్లు ఉన్నాయి. కోల్‌కతా, పంజాబ్ జట్లు తమ తదుపరి మూడు మ్యాచ్‌లు ఓడిపోయి.. హైదరాబాద్ మూడు మ్యాచ్‌లు గెలిస్తే.. వార్నర్ టీమ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

కోల్‌కతా రాబోయే మూడు మ్యాచ్‌లు ఓడిపోతే.. ఆ టీమ్ 12 పాయింట్లకే పరిమితమవుతుంది. పంజాబ్ కూడా తదుపరి మూడు మ్యాచ్‌లు ఓడిపోతే ఆ జట్టు 10 పాయింట్ల వద్దే ఉంటుంది. అదే హైదరాబాద్ రాబోయే మూడు మ్యాచ్‌లు గెలిస్తే... మొత్తంగా 14 పాయింట్లు సాధిస్తుంది. అంతేకాదు ఈ మూడు జట్లలో హైదరాబాద్ నెట్ రన్ రేట్ పాజిటివ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే మూడు మ్యాచ్‌ల్లో కేకేఆర్, పంజాబ్ ఓడిపోతే.. హైదరాబాద్ టీమ్ ప్లే ఆఫ్స్‌లోకి వెళ్తుంది. కోల్‌కతా ఒక్క మ్యాచ్ గెలిచినా.. హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్స్‌కువ వెళ్లలేదు.
Published by: Shiva Kumar Addula
First published: October 25, 2020, 4:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading