ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్.. వన్ అండ్ ఓన్లీ

David warner: పంజాబ్ జట్టుపై మరో రికార్డు కూడా నెలకొల్పాడు డేవిడ్ వార్నర్. ఆ జట్టుపై 9 వరుస మ్యాచ్‌లో 50కి పైగా స్కోర్ చేయడం విశేషం.

news18-telugu
Updated: October 9, 2020, 11:49 AM IST
IPL 2020: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్.. వన్ అండ్ ఓన్లీ
డేవిడ్ వార్నర్
  • Share this:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించారు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 50సార్లు 50కి పైగా స్కోర్ సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. గురువారం పంజాబ్‌తో జరగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 132 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్.. 46 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు చేశాడు. మొత్తంగా 50 సార్లు 50కి పైగా రన్స్ సాధించాడు. నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టుపై 52 పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్. అతడి తర్వాతి స్థానంలో విరాట్ కొహ్లీ ఉన్నాడు. 182 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్.. 37 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు సాధించాడు. తద్వారా 42 సార్లు 50కి పైగా స్కోర్ చేశాడు.

అంతేకాదు పంజాబ్ జట్టుపై మరో రికార్డు కూడా నెలకొల్పాడు డేవిడ్ వార్నర్. ఆ జట్టుపై 9 వరుస మ్యాచ్‌లో 50కి పైగా స్కోర్ చేయడం విశేషం. ఈ సీజన్‌లో రెండోది. మొత్తంగా కింగ్స్ ఎలెవన్ జట్టుపై ఇప్పటి వరకు 11 సార్లు 50కి పైగా స్కోర్ చేశాడు. 58, 81, 59, 52, 70, 51, 70, 81, 52.. పంజాబ్‌తో హైదరాబాద్ జట్టు ఆడిన గత 9 మ్యాచ్‌ల్లో వార్నర్ చేసిన స్కోర్ ఇది. అంటే మనోడు పంజాబ్ జట్టుపై ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు.ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా గురువారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు బెయిర్ స్టో 97, వార్నర్ 52 పరుగులతో పంజాబ్‌ను చెడుగుడు ఆడుకున్నారు. వీరిద్దరి బీభత్సంతో హైదరాబాద్ స్కోరు 230కి వెళ్తుందనుకున్న వేళ.. 160 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో వార్నర్ ఔట్ అయ్యాడు. అదే ఓవర్లో బెయిర్ స్టో ఔట్ కావడంతో స్కోర్ నెమ్మదించింది. చివరకు ఎలాగోలా 200 మార్క్‌ను దాటించారు. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, అర్షదీప్ సింగ్ 2 వికెట్లు, షమి ఒక వికెట్ పడగొట్టారు.


202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. ఆరంభం నుంచే తడబడింది.11 పరుగులకే మయాంగ్ అగర్వాల్ వికెట్ పడింది. ఆ తర్వాత సిమ్రాన్ సింగ్, కేఎల్ రాహుల్ కూడా ఔటయ్యారు. ఐతే నికోలస్ పూరన్ మాత్రం హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వికెట్లు పడుతున్నా ఒంటరిపోరాటం చేశాడు. చివరకు 15 వ ఓవర్‌లో పూరన్ ఔట్ అవడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది. పూరన్ 77 పరుగులతో అదరగొట్టాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు. హైదరాబాద్ బౌలర్లు విజృంభించడంతో 132 పరుగులు చేసి 16.5 ఓవర్లకే ఆలౌటయింది. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ ఖాన్‌కు 3, ఖలీల్ అహ్మద్ 2, నటరాజన్ 2, అభిషేక్ శర్మ ఒక వికట్ సాధించారు.
Published by: Shiva Kumar Addula
First published: October 9, 2020, 11:40 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading