ఐపీఎల్ 2020

  • associate partner

CSK vs RCB, IPL 2020: టాస్ గెలిచిన బెంగళూరు.. జట్లలో మార్పులు ఇవే

CSK vs RCB, IPL 2020: చెన్నై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జోష్ హేజిల్‌వుడ్, శార్దుల్ ఠాకూర్ స్థానంలో మిచెల్ శాంటర్, మోను కుమార్ జట్టులోకి వచ్చారు. ఇక బెంగళూరు ఒకే ఒక్క మార్పు చేసింది. ఇసురు ఉడానా స్థానంలో మోయిన్ అలీని జట్టులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: October 25, 2020, 3:16 PM IST
CSK vs RCB, IPL 2020: టాస్ గెలిచిన బెంగళూరు.. జట్లలో మార్పులు ఇవే
విరాట్ కొహ్లీ, ఎంఎస్ ధోనీ (Image:IPL)
  • Share this:
IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పుడు 44వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కొహ్లీ మరోసారి పోటీపడుతున్నారు. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జోష్ హేజిల్‌వుడ్, శార్దుల్ ఠాకూర్ స్థానంలో మిచెల్ శాంటర్, మోను కుమార్ జట్టులోకి వచ్చారు. ఇక బెంగళూరు ఒకే ఒక్క మార్పు చేసింది. ఇసురు ఉడానా స్థానంలో మోయిన్ అలీని జట్టులోకి తీసుకున్నారు.


జట్ల వివరాలు:
Chennai Super Kings (Playing XI): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎన్. జగదీశన్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), సామ్ కరన్, రవీంద్ర జడేజా, మిచెల్ శాంటర్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, మోను కుమార్.


Royal Challengers Bangalore (Playing XI): దేవదత్ పడిక్కల్, అరోన్ ఫించ్, విరాట్ కొహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, గురుకీరట్ సింగ్ మాన్, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్


2008 ఐపీఎల్ టోర్నీ ఆరంభం నుంచీ చెన్నై, బెంగళూరు జట్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అందులో ధోనీ సేన 16 మ్యాచ్‌ల్లో గెలిచింది. బెంగళూరు జట్టు ఎనిమిదింటిలో మాత్రమే విజయం సాధించింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. ఈ టోర్నీటో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు తలపడ్డాయి. అక్టోబరు 10న ఇదే దుబయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నైపై బెంగళూరు ఘన విజయం సాధించింది. 37 పరుగుల తేడాతో కొహ్లీసేన గెలుపొందింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. టోర్నీలో 11 మ్యాచ్‌లాడిన ధోనీ సేన.. 7 మ్యాచ్‌లు ఓడిపోయి.. కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. ఐపీఎల్ టోర్నీలో శుభారంభం చేసిన సీఎస్‌కే అదే జోరును కొనసాగించలేకపోయింది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై‌పై విజయం సాధించి సత్తా చాటింది. ఐతే ఆ తర్వాత చెత్త ప్రదర్శనతో అట్టడుగు స్ధానానికి వెళ్లిపోయింది. ఇక బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ సేన.. ఏడింటిలో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది.
Published by: Shiva Kumar Addula
First published: October 25, 2020, 3:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading