ఐపీఎల్ 2020

  • associate partner

CSK vs RCB, IPL 2020: కొహ్లీ హఫ్ సెంచరీ.. ఆర్సీబీ డీసెంట్ స్కోర్.. చెన్నై చేధిస్తుందా?

IPL 2020, Royal Challengers Bangalore vs Chennai Super Kings: చెన్నై బౌలర్లలో సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

news18-telugu
Updated: October 25, 2020, 5:10 PM IST
CSK vs RCB, IPL 2020: కొహ్లీ హఫ్ సెంచరీ.. ఆర్సీబీ డీసెంట్ స్కోర్.. చెన్నై చేధిస్తుందా?
RCB vs CSK Live Score Updates: కొహ్లీ, డివిలియర్స్ బ్యాటింగ్
  • Share this:
IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పుడు 44వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కెప్టెన్ కొహ్లీ మరోసారి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 43 బంతుల్లో 50 రన్స్ చేశాడు. డివిలియర్స్ 39, దేవదత్ పడిక్కల్ 22, ఆరోన్ ఫించ్ 15 పరుగులు చేశారు. జట్టు స్కోర్ 42 పరుగులకు ఓపెనర్స్ ఇద్దరు ఔట్ అవడంతో..ఆ తర్వాత స్కోర్ బాధ్యతలను కొహ్లీ, డివిలియర్స్ చేపట్టారు. ఆచితూచి ఆడుతూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.

ఐతే 18వ ఓవర్లలో డివిలియర్స్.. ఆ తర్వాత మోయిన్ అలీ, కొహ్లీ, మోరిస్ వరుసగా ఔట్ కావడంతో బెంగళూరు స్కోర్ తగ్గిపోయింది. చివరకు 150 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ రెండు, మిచెల్ సాంట్నర్ ఒక వికెట్ సాధించారు.

2008 ఐపీఎల్ టోర్నీ ఆరంభం నుంచీ చెన్నై, బెంగళూరు జట్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అందులో ధోనీ సేన 16 మ్యాచ్‌ల్లో గెలిచింది. బెంగళూరు జట్టు ఎనిమిదింటిలో మాత్రమే విజయం సాధించింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. ఈ టోర్నీటో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు తలపడ్డాయి. అక్టోబరు 10న ఇదే దుబయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో చెన్నైపై బెంగళూరు ఘన విజయం సాధించింది. 37 పరుగుల తేడాతో కొహ్లీసేన గెలుపొందింది. ఈ మ్యాచ్లో గెలిచి బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది చెన్నై సూపర్ కింగ్స్.


ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. టోర్నీలో 11 మ్యాచ్‌లాడిన ధోనీ సేన.. 7 మ్యాచ్‌లు ఓడిపోయి.. కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. ఐపీఎల్ టోర్నీలో శుభారంభం చేసిన సీఎస్‌కే అదే జోరును కొనసాగించలేకపోయింది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై‌పై విజయం సాధించి సత్తా చాటింది. ఐతే ఆ తర్వాత చెత్త ప్రదర్శనతో అట్టడుగు స్ధానానికి వెళ్లిపోయింది. ఇక బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ సేన.. ఏడింటిలో విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయింది.
Published by: Shiva Kumar Addula
First published: October 25, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading